Allu Arjun: బాలీవుడ్‌లో కూడా చరణ్‌కి పోటీ..

ఇండస్ట్రీ మారుతున్న మెగా కాంపౌండ్ హీరోల పోటీ మాత్రం తగ్గడం లేదు. మెగా కాంపౌండ్ లో ఉన్న గ్లోబల్ స్టార్ గా ఎదిగిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఐకన్ స్టార్ గా ఎదిగిన స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ఇండస్ట్రీ టాప్ ప్లేస్ లో ఉన్న విషయం తెలిసిందే. వీరితో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ కూడా టాప్ ప్లేస్ కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే వీరు ప్రస్తుతం టాలీవుడ్ లోనే సినిమాలు చేస్తూ, ప్రపంచ సినిమా వేదికపై పోటీ పడుతున్నారు. కాగా, వీళ్లు బాలీవుడ్, హాలీవుడ్ తెరలపై కూడా కనిపించడానికి తెగ ప్రయత్నిస్తున్నారు.

రామ్ చరణ్ ఇప్పటికే ముంబైలో ప్రత్యేకంగా ఒక టీం ను కూడా నడుపుతున్నాడని తెలుస్తుంది. ఇదిలా ఉండగా, చరణ్ ప్రస్తుతం బాలీవుడ్ లో కిసీ క భాయ్ కిసీ కా జాన్ అనే సినిమాలో ప్రత్యేక పాత్ర చేస్తున్నాడు. ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన యేటమ్మ అనే సాంగ్ లో రామ్ చరణ్ కనిపించిన విషయం తెలిసిందే. పాటతో పాటు సినిమాలో కూడా రామ్ చరణ్ పాత్ర కీలకంగా ఉంటుందని తెలుస్తుంది. కాగా కిసీ క భాయ్ కిసీ కా జాన్ మూవీ, తమిళంలో వీరం, తెలుగులో వచ్చిన కాటమరాయుడు అనే సినిమా రీమేక్.

ఇదిలా ఉండగా, అల్లు అర్జున్ కూడా బాలీవుడ్ లో అడుగుపెట్టబోతున్నాడు. షారుక్ ఖాన్, నయనతార హీరో, హీరోయిన్లుగా తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న మూవీ జవాన్. ఈ సినిమాలో బన్నీ కీలక పాత్ర చేస్తున్నాడని ఇటీవల వార్తలు వచ్చాయి. కానీ, అవి రూమర్స్ అని కొంత మంది కొట్టేశారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. జవాన్ మూవీలో అల్లు అర్జున్ గెస్ట్ రోల్ చేస్తున్నాడట. ఇప్పటికే బన్నీ పాత్ర షూటింగ్ కూడా పూర్తి అయిందని బీ టౌన్ కోడై కూస్తుంది.

- Advertisement -

ఒక వేళ ఇది నిజమైతే, మెగా హీరోలు బాలీవుడ్ లో కూడా పోటీపడటం ఖాయమని చెప్పొచ్చు.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు