Sitara: మహేష్ కూతురిపై నెట్టింట్లో దారుణమైన ట్రోల్స్

మహేష్ బాబు కూతురు సితార పాప గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్న వయసులోనే సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చి ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది ఈ పాప. ఫ్యామిలీ ఫోటోలే కాకుండా… తనకు నచ్చిన పాటకు స్టెప్పులు వేస్తున్న వీడియోస్ కూడా షేర్ చేస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో సీతారకు ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే. కేవలం మాటలతోనే కాకుండా తనలోని డాన్సింగ్ టాలెంట్, పెయింటింగ్ అలాగే సింగింగ్ టాలెంట్ తో తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఏర్పరచుకుంది సితార పాప.

తాజాగా సితార తన ఇన్స్టా గ్రామ్ వేదికగా షేర్ చేసిన ఫోటోలు నెట్ సందడి చేస్తున్నాయి. కారు బ్యాక్ సీటులో కూర్చుని… డోర్ గ్లాసు దించేసి అందులోంచి బయటకు చూస్తూ సితార ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలను చూసి అభిమానులు వరల్డ్ లక్కీ డాటర్ అని కామెంట్లు చేస్తూ ఉంటే మరికొంతమంది నేటిజెన్లు మాత్రం ట్రోలింగ్ మొదలుపెట్టారు.

ఎందుకు ఇలా చేశావు అంటూ ఫైర్ అవుతున్నారు కొంతమంది నేటిజన్లు. సితార ఎందుకిలా చేశావు… నువ్విలా చేయడం చూసి చాలామంది ఇలానే చేస్తారు. రోడ్డు మీద ట్రాఫిక్ లో పిల్లలు ఇలా ఫోజులు ఇస్తే జరగరానిది ఏదైనా జరిగితే వాళ్ల కుటుంబాలు ఎంత బాధ పడతాయి అంటూ అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నువ్వు పెట్టే ఈ పోస్ట్ కారణంగా ఆ కుటుంబాలు రోడ్డున పడతాయి అంటూ మండిపడుతున్నారు. ఇలాంటి పనులు చేయకూడదని హెచ్చరిస్తున్నారు నెటిజన్లు. ఇలా నెటిజన్ల ఆగ్రహానికి గురైంది సితార పాప.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు