NTR: దేవర లో అల్లు అర్హ

కేవలం 6ఏళ్ళ వయసు మాత్రమే ఉన్న అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ కు వరుస సినిమా అవకాశాలు వస్తున్నాయి. ఇటీవలనే సమంత ప్రధాన పాత్రలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన శాకుంతలం సినిమాలో చిన్న క్యామియో లో కనిపించిన అల్లు అర్హ, ప్రేక్షకులను తన బుజ్జి బుజ్జి మాటలతో, క్యూట్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది.

మొదటి సినిమానే భారీ బడ్జెట్ సినిమాలో నటించే అవకాశమందుకున్న ఈ బేబీ గర్ల్ మరో పాన్ ఇండియా సినిమాలో గోల్డెన్ ఆపర్చునిటీ కొట్టేసిందని ఫిలిం నగర్ లో టాక్ నడుస్తుంది. అయితే ఈ టాక్ లో నిజమెంతో తెలియదు గాని నిజంగా నిజం అవ్వాలని మాత్రం చాలా మంది కోరుకుంటున్నారు.

జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న దేవర షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఇటీవలనే ఒక పవర్ ప్యాకెడ్ యాక్షన్ షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా , నెక్స్ట్ షెడ్యూల్ లో ఫ్యామిలీ ఎమోషనల్ సీన్స్ ను తెరకెక్కించనున్నారు.

- Advertisement -

అయితే సినిమాలో ఉండే ఒక ఇంపార్టెంట్ చిన్న పాపా రోల్ గాను ఆర్టిస్ట్ కోసం అందరు చూస్తుండగా, యూనిట్ లోనే ఎవరో అల్లు అర్హ ను తీసుకుందామని ఐడియా ఇచ్చారంట, దాంతో యూనిట్ అంత కూడా ఆ అల్లు అర్హ ఐతే బాగుంటుందని ఎవరికీ వారు అభిప్రాయ పడ్డారట. ఇక అల్లు అర్జున్, ఎన్టీఆర్ ల మధ్య ఎంత మంచి బాండింగ్ ఉందొ అందరికి తెలిసిందే. దాని వల్ల అల్లు అర్హ సినిమాలో పెట్టుకోడానికి మేకర్స్ కూడా సుముఖంగా ఉన్నారట. మరీ ఈ రూమర్ లో నిజం అవుతుందో లేక అన్నింటిలాగా కేవలం పుకారుగానే మిగిలిపోతుందో చూడాలి.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు