UBS: పవన్ కళ్యాణ్ సినిమాను పక్కన పెట్టేసిన ఆ డైరెక్టర్ ?

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. అయితే గత కొద్దీ రోజుల క్రితం వరకు ఈ సినిమాలన్నీ ఒక పక్క షూటింగ్స్ జరుపుకుంటూ, మరో పక్క ఫ్యాన్స్ కు అప్డేట్స్ ఇస్తూ హడావిడిగా ఉండేవి . సోషల్ మీడియా అంత పవన్ సినిమా అప్డేట్స్ తో నిండిపోయేది.

అయితే గత కొద్దీ రోజుల నుంచి మాత్రం ఈ హడావిడి తగ్గిందనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ పొలిటికల్ మీటింగ్స్ వల్ల సడన్ గా ఆయన సినిమాల షూటింగ్స్ అన్నీ ఆగిపోయాయి. దాంతో డైరెక్టర్లు, ప్రొడ్యూసర్స్ పవన్ తో సినిమా చేస్తునన్నామని సంతోషించేలోపే పవన్ డేట్స్ కారణంగా సినిమాలు ఆగిపోవడంతో ఇరుకున పడిపోయినట్టైంది.

ఇక ఏకంగా ఒక పవన్ కళ్యాణ్ వీరాభిమాని అయిన డైరెక్టర్ హరీష్ శంకర్ ఐతే పవన్ సినిమాని పక్కన పెట్టేసి, అంతలోనే వేరే సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. అయితే ఏపీ లో రాజకీయ పరిస్థితులు రోజుకొరకంగా మారుతున్న క్రమంలో పవన్ కళ్యాణ్ ప్రజలకు అందుబాటులో ఉండటం తప్పనిసరి అయింది. దాంతో. డైరెక్టర్ హరీష్ శంకర్ పవన్ మళ్ళీ తిరిగి డేట్స్ ఇవ్వడానికి ఎలాగూ టైం పట్టేలా ఉందని గ్రహించి, ప్రస్తుతం ఆయన చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని పక్కన పెట్టి, మాస్ మహారాజ్ రవితేజ తో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు.

- Advertisement -

హిందీలో అజయ్ దేవగన్ హీరోగా నటించిన రైడ్ సినిమా రీమేక్ గా హరీష్ శంకర్ రవితేజ సినిమా కథను తయారు చేసే పనిలో పడ్డాడట. రీమేక్ సినిమాలను తనదైన స్టైల్ తో తీసి, హిట్ కొట్టడంలో ఎక్స్పార్ట్ గా పేరున్న హరీష్ శంకర్ ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ పనుల్లో ఉన్నట్టు టాక్. ఇప్పటికే రవితేజ – హరీష్ శంకర్ కాంబినేషన్ లో రెండు సినిమాలు చేయగా, ముచ్చటగా మూడోసారి వీరి కాంబో రిపీట్ ఆవబోతుంది అయితే ఈ సినిమాను కూడా మైత్రి మూవీ మేకర్సే ప్రొడ్యూస్ చేయబోతున్నట్టు టాక్.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు