Bholaa Shankar: మరో లీక్ తో హైప్ పెంచిన చిరు – ఫ్యాన్స్ కి పండగే..!

మెగాస్టార్ చిరంజీవి మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 11న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసిన సినిమా యూనిట్ వరుస అప్డేట్స్ తో సినిమాపై హైప్ క్రియేట్ చేసే పనిలో పడింది. ఇటీవల జామ్ జామ్ జజ్జనక లిరికల్ సాంగ్ రిలీజ్ అయ్యి ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపింది. తాజాగా చిరు లీక్స్ అంటూ చిరంజీవి మరో ఆసక్తికర అప్డేట్ వదిలాడు ట్విట్టర్లో. సినిమాలో చిరు పవన్ కళ్యాణ్ ఇమిటేట్ చేస్తున్న సీన్ కి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేసాడు. ఈ లీక్ మెగా అభిమానులతో సహా నార్మల్ ఆడియెన్స్ లో కూడా సినిమాపై ఆసక్తి పెంచుతోంది.

సాధారణంగా పవన్ కళ్యాణ్ తో సహా మెగా హీరోల సినిమాల్లో చిరంజీవి రిఫరెన్స్ చూస్తూ ఉంటాం. ఆ సీన్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది గతంలో చాలా సినిమాలకు. ఇప్పుడు చిరంజీవి పవన్ కళ్యాణ్ ని ఇమిటేట్ చేయటం మెగా అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. థియేటర్స్ లో ఈ సీన్స్ కి ఏ రేంజ్ లో రెస్పాన్స్ వస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

చిరు లీక్స్ పేరిట చిరంజీవి సినిమాకు హైప్ క్రియేట్ చేయటం ఇది కొత్తేమి కాదు. ఆచార్య సినిమా టైమ్ లో మొదలైన ఈ చిరు లీక్స్ పరంపర వాల్తేరు వీరయ్య సినిమా సమయంలో ‘నువ్వు శ్రీదేవైతే’ సాంగ్ ని లీక్ చేయటం వరకు సక్సెస్ ఫుల్ గా సాగింది. ప్రస్తుతం భోళా శంకర్ సినిమాకి ఆశించిన స్థాయిలో బజ్ క్రియేట్ అవ్వని నేపథ్యంలో చిరు లీక్స్ తో బరిలో దిగాడు మెగాస్టార్. రీసెంట్ హిట్ వాల్తేరు వీరయ్యతో ఊపు మీదున్న మెగాస్టార్ భోళా శంకర్ తో హిట్ అందుకొని విజయ పరంపర కొనసాగిస్తాడా లేదా అన్నది వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు