Aditi rao Hydari: లక్కీగా మరో ఛాన్స్… మణిరత్నం సినిమాలో.?

మణిరత్నం… పేరుకు తమిళ్ దర్శకుడు అయినా కూడా, తెలుగు ప్రేక్షకులకు మోస్ట్ ఫేవరెట్ డైరెక్టర్. ఎందుకంటే తెలుగు, తమిళ్ లో వచ్చిన గొప్ప గొప్ప ప్రేమ కథలన్నీ కూడా మణిరత్నం తీసినవే.
అసలు లవ్ స్టోరీస్ అంటే గుర్తొచ్చేది మణిరత్నం,అందుకే తనను లవ్ గురు అని కూడా అంటారు. మణిరత్నం సినిమా గురించి, మణిరత్నం సినిమాలో బ్యూటీ గురించి, మణిరత్నం చూపించే ప్రేమను గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.

కొన్ని సినిమాల ద్వారా ఒక ఫీల్ తో ప్రేక్షకుల్ని కూర్చుని పెట్టడం మణిరత్నానికి మాత్రమే సాధ్యం. కేవలం ప్రేమకథా చిత్రాలు మాత్రమే మణిరత్నం తెరకెక్కించాడు అనుకుంటే అది పొరపాటు. “నాయకుడు” లాంటి గ్యాంగ్ స్టార్ సినిమా, యువ లాంటి పొలిటికల్ డ్రామాను కూడా తెరకెక్కించాడు మణిరత్నం.

“నాయకుడు” సినిమాని తెలుగు గాడ్ ఫాదర్ అని కూడా కొంతమంది పిలుస్తారు. ప్రస్తుతం మణిరత్నం కమల్234 సినిమాని డైరెక్షన్ చేస్తున్నారు. ఈ సినిమాకి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.
ఈ సినిమాలో ప్రముఖ యంగ్ బ్యూటీ అదితిరావ్ హైదరి నటించబోతున్నట్లు సమాచారం వినిపిస్తుంది. ఈ సినిమాలో అదితిరావ్ హైదరి కమల్ హాసన్ చెల్లెలుగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇదివరకే మణిరత్నం దర్శకత్వం వహించిన “చెలియా” సినిమాలో కార్తీ సరసన నటించింది అదితిరావ్ హైదరి.

- Advertisement -

Grab Filmify for the latest web stories on Celebrities, today’s Tollywood news, the latest images of actors & actresses, new movie ratings & reviews, and the latest entertainment news from all Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు