Biggboss season7: ఎర్రగడ్డ అంటే తప్పు.. పిచ్చోడు అంటే తప్పు లేదు.. వాహ్!

బిగ్ బాస్ సీజన్ 7 లో ఫైర్ బ్రాండ్ గా పేరుతెచ్చుకున్న శోభా శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాలిన పనిలేదు. ఈ సీజన్లో ఎంట్రీ ఇచ్చినప్పటినుండి ప్రతి వారం ఎవరో ఒక కంటెస్టెంట్ తో ఎదో ఒక గొడవ పెట్టుకొనేదే ఈమెకి నిద్ర రాదు అన్నట్టు ఉంటుంది. గేమ్ ప్రకారం బాగానే ఆడుతున్నా, అప్పుడప్పుడు టాస్క్ లలో మిస్టేక్స్ చేస్తూ, అందరిపై అరుస్తూ, అలుగుతూ ఉంటుంది.

ఇక లాస్ట్ వీక్ భోలే తో శోభా చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఆ విషయం నాగార్జున దాకా వెళ్లగా, భోలే తాను చేసిన తప్పుకు క్షమాపణలు కూడా అడిగాడు. అయినప్పటికీ శోభా భోలే ని క్షమించను అనేసింది.

అయితే తాజాగా కెప్టెన్సి టాస్క్ లో శోభా ని యావర్ అర్హురాలు కాదు అని నామినేట్ చేస్తుంటే, ఆ గొడవ పెద్దదై యావర్ ని ‘పిచ్చోడు’ అనేసింది. గత కొని రోజులుగా యావర్ కూల్ గా ఆడుతున్నా, శోభా అంత మాట అనడంతో కంట్రోల్ చేసుకోలేక తాను కూడా ఫైర్ అయ్యాడు.

- Advertisement -

అయితే లాస్ట్ వీక్ భోలే ఎర్రగడ్డ అన్న పదాన్ని వాడితేనే అంత ఫైర్ అయి, నానా రభస చేసిన శోభా, ఈ సారి తాను కూడా విచక్షణ జ్ఞానం కోల్పోయి పిచ్చి, పిచ్చోడు అంటూ యావర్ ని అనడం ఎంతవరకు కరెక్ట్ అని శోభని సోషల్ మీడియా లో ట్రోల్ చేస్తున్నారు.  ఎర్రగడ్డ అంటే తప్పు, పిచ్చోడు అంటే తప్పు లేదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయంపై నాగార్జున ఈ సారి గట్టిగానే రియాక్ట్ అవుతారు అని నెటిజన్లు భావిస్తున్నారు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు