Biggboss season7: రెండోసారి కెప్టెన్సీ జస్ట్ మిస్!

టెలివిజన్ లో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 7 ప్రసారమవుతున్నప్పటినుండి మాటీవీ టిఆర్పీ రేటింగ్ ఓ రేంజ్ లో వస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా వైల్డ్ కార్డు ఎంట్రీ లు వచ్చినప్పటినుండి షో చాలా ఇంట్రెస్టింగ్ గా తయారయ్యింది. ఇక ఈ షో లో తొమ్మిదో వారం కెప్టెన్సీ టాస్క్ మొదలవగా, ఈ టాస్క్ లో హౌస్ ఇంటి సభ్యులందరూ అన్ని రకాల టాస్క్ లలో పాల్గొన్నారు.

అయితే ఈ టాస్క్ లో కొంచెం టఫ్ గేమ్ అయింది మాత్రం డ్రెస్సింగ్ టాస్క్. ఈ టాస్క్ లో శోభా, తేజ, యావర్ పాల్గొనగా, అందరికంటే ఎక్కువ బట్టలు వేసుకున్న వాళ్ళకి కెప్టెన్సి అర్హత ఉంటుందని బిగ్ బాస్ చెప్తాడు.
ఇక బెల్ మోగగానే ముగ్గురూ డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లి ఎవరికీ వారు ఇష్టమొచ్చినట్టు, ఏది పడితే అది వేసుకుంటూనే పోయారు. సరదాగా కూడా సాగిన ఈ టాస్క్ లో తేజ అవుట్ అయ్యాడు. ఎందుకంటే తేజ ఎలాగో కాస్త లావుగా ఉంటాడు కాబట్టి ఎక్కువ బట్టలు వేసుకోలేడు.

అయితే ఈ టాస్క్ లో విన్ అయింది శోభా శెట్టి. యావర్ చాలా బాగా పెర్ఫార్మ్ చేయగా, దాదాపు 70 బట్టలు వంటిపైనా వేసుకుని కొద్దిలో కెప్టెన్సీ మిస్ చేసుకున్నాడు. శోభా 72 బట్టలు వేసుకుని, విన్ అయింది. అంటే యావర్ కి , శోభకు డిఫరెన్స్ జస్ట్ రెండు నంబర్లే. శోభా చాలా సన్నగా ఉన్నందువల్ల ఈ టాస్క్ లో విన్ అవడానికి ఈజీ అయిందని చెప్పొచ్చు.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు