Bigg Boss 7: 105 రోజులకు గానూ ప్రియాంక ఎంత తీసుకెళ్లిందో తెలుసా..?

పిట్ట కొంచెం కూత ఘనం అని నిరూపించింది ప్రియాంక జైన్.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో కంటెస్టెంట్ గా పాల్గొని చివరి వరకు వన్ అండ్ ఓన్లీ లేడీ కంటెస్టెంట్గా నిలిచి అందరిని ఆకట్టుకుంది. ఒక్కో దశని దాటుకుంటూ ఫినాలే వరకు వచ్చిన ప్రియాంక చిట్టచివరి ఆదివారం ఎపిసోడ్లో టాప్ ఫైవ్ లో మొదట ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ గా నిలిచింది. టైటిల్ విన్నర్ సాధించలేకపోవచ్చు ఓట్ల విషయంలో మిగతా వారి కంటే వెనుకబడిపోయి ఉండవచ్చు కానీ కొన్ని విషయాలలో మాత్రం అందరి మనసులు గెలుచుకుంది.

దీనికి తోడు మంచి రెమ్యునరేషన్ తో బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చింది ఈ ముద్దుగుమ్మ. బిగ్ బాస్ హౌస్ లోకి మొదటి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన ఈమెపై ఎవరికి పెద్దగా అంచనాలు లేవు. సీరియల్ నటిగా అందరికీ తెలిసిన ఈమె.. ఇప్పుడు బిగ్బాస్ హౌస్ లోకి వచ్చిన తర్వాత అందరికీ భారీగా పరిచయం అయిపోయింది. తొలి పవర్ ఆస్త్ర కోసమే చివరి వరకు వచ్చి ఓడిపోయిన ఈమె అక్కడి నుంచి మొదలుపెడితే దాదాపు చాలా ఆటలలో చివరి వరకు వచ్చి ఓడిపోయిందని చెప్పవచ్చు. ఒకటి రెండు సార్లు మినహా.. సీజన్ అంతా కూడా డీసెంట్ గా ఆడింది. అమ్మాయి కావడం.. పెద్దగా ఫాలోవర్స్ లేకపోవడంతో ఈమెకు ఓట్లు పడలేదు.

లేడీ కంటెస్టెంట్గా చివరి వరకు నిలిచిన ప్రియాంక ఓటింగ్ విషయంలో బలమైన కంటెస్టెంట్స్ ఈమె కంటే ముందు ఉండడం ఈమెకు పెద్ద మైనస్ అని చెప్పవచ్చు. ఈ సీజన్లో పాల్గొన్న అమ్మాయిలు అందరితో పోలిస్తే ఈమె బెస్ట్ పెర్ఫార్మర్ అని చెప్పడంలో సందేహం లేదు. చాలామంది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా శివాజీ కంటే కూడా ప్రియాంక చాలా బెటర్ అని నేటిజెన్లు కూడా కామెంట్లు చేస్తున్నారు. ఇక మరి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లే ముందు ఎంత డబ్బుతో ఈమె బయటకు వెళ్ళింది అనే విషయానికి వస్తే 15 వారాలపాటు అంటే 105 రోజులపాటు హౌస్ లో కొనసాగిన ప్రియాంక వారానికి రూ .2.5లక్షల రెమ్యూనరేషన్ చొప్పున మొత్తం 37.5 లక్షలు సంపాదించినట్లు తెలుస్తోంది. ఇక ఇంత మొత్తం డబ్బులు అంటే ప్రియాంక ఇక ఆర్థికంగా కుదుటపడినట్లే అని చెప్పవచ్చు. ఏది ఏమైనా ఈమె తీసుకెళ్లిన మొత్తం భారీ స్థాయిలో ఉండడం గమనార్హం.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు