Bahubali 3: సినీ లవర్స్ కి గుడ్ న్యూస్.. క్లారిటీ ఇచ్చిన ప్రభాస్..!

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన బాహుబలి-1, బాహుబలి-2 చిత్రాలు ఎంతటి విజయాన్ని అందుకున్నాయో చెప్పాల్సిన పనిలేదు. ఈ చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమ నెక్స్ట్ లెవెల్ లో వెళ్లిపోయింది. ప్రభాస్ కూడా పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించారు.. అయితే ఆ తర్వాత ప్రభాస్ కి అనుకున్నంత స్థాయిలో సక్సెస్ లు రాలేకపోయాయి. ఇటీవలే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటించిన సలార్ సినిమా ఈనెల 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.

దీంతో చిత్ర బృందం పలు రకాల ప్రమోషన్స్ సైతం వేగవంతం చేస్తోంది. సలార్ సినిమా పైన అభిమానులకు భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే సలార్ సినిమా పైన ఎలాంటి ప్రమోషన్స్ చేయకపోవడంతో అభిమానులు తీవ్ర నిరుత్సాహంతో ఉన్నారు. అయితే ఇలాంటి సమయంలోనే రాజమౌళి, ప్రభాస్ ,ప్రశాంత్ నీల్, పృథ్వీరాజ్ సుకుమారన్ తో కలిసి ఒక ఇంటర్వ్యూ ని చేయడం జరిగింది. అందుకు సంబంధించి ఒక ఫోటో కూడా వైరల్ గా మారుతోంది.

అంతేకాదు ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన ప్రోమో ని కూడా విడుదల చేయగా ఇది నెట్టింట బాగా వైరల్ గా మారుతుంది. ఈ ఇంటర్వ్యూలో సలార్ సినిమాతో పాటు కేజిఎ, ఫ్ బాహుబలి చిత్రాల గురించి డిస్కషన్ జరిగినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే ఈ ప్రోమోలో పూర్తిగా చూపించక పోయినా.. ఒక హింట్ మాత్రం ఇచ్చినట్లుగా తెలుస్తున్నది .అయితే ప్రోమో చివరిలో ప్రభాస్ అయితే కచ్చితంగా బాహుబలి-3 ఉంటుందనే విషయాన్ని తెలియజేయడంతో అభిమానులు సైతం ఫుల్ ఖుషీ అవుతున్నారు దీంతో ఈ విషయం మరొకసారి వైరల్ గా మారుతున్నది.

- Advertisement -

ప్రభాస్ కెరియర్ లోనే బాహుబలి సినిమా ఎంతటి భారీ విజయాన్ని అందుకుందో చెప్పాల్సిన పనిలేదు.. ఈ సినిమా ప్రభాస్ ని ప్రపంచానికి పరిచయం చేసిందని చెప్పవచ్చు. గతంలో కూడా ఈ సినిమా పార్ట్-3 ఉంటుంది అనే వార్తలు కూడా వినిపించాయి. ఇప్పుడు ప్రభాస్ నోటి నుంచి కూడా బాహుబలి3 ఉంటుందనే విషయం రావడంతో అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఇందుకు సంబంధించి పూర్తి క్లారిటీ రావాలి అంటే ఫుల్ ఇంటర్వ్యూ ఈనెల 19వ తేదీన విడుదల కాబోతోంది..

 

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు