Biggboss season7: ‘పూల్ డాన్స్ టాస్క్’.. ఇక నుండి ఇలాంటి టాస్క్ లే?

బిగ్ బాస్ సీజన్ 7 మరో రెండు వారాల్లో ముగుస్తుందన్న సంగతి తెలిసిందే. ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో ఆఖరి నామినేషన్ జరుగుతుందని బిగ్ బాస్ చెప్పడంతో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో రెచ్చిపోయారు. ఇక ఎక్కువ సార్లు యావర్, అమర్ దీప్ నామినేట్ అయ్యారు. అయితే ఇక నామినేషన్ ప్రాసెస్ జరిగాక ఈ వారం నుండి ఎలాంటి పవర్ అస్త్ర టాస్కులు, ఇమ్మ్యూనిటీ సేవ్ టాస్క్ లు ఉండవని తెలిసిందే.

అలాంటప్పుడు ఈ రెండు వారాలు ఏం టాస్కులు ఉంటాయో అని బిగ్ బాస్ ఆడియన్స్ అనుకోవచ్చు. దానికి బిగ్ బాస్ హింట్ ఇస్తూ ఈరోజు ఒక ఎంటర్టైన్మెంట్ టాస్క్ పెడుతున్నట్టు బిగ్ బాస్ ప్రోమో ద్వారా తెలిసింది. పూల్ డాన్స్ టాస్క్ అని పెట్టిన బిగ్ బాస్ ఆ టాస్క్ లో స్విమ్మింగ్ పూల్ లో దూకి డాన్స్ చేయాలనీ, లాస్ట్ లో దూకిన కంటెస్టెంట్స్ అవుట్ అవుతారని అన్నారు.

అయితే ఈ టాస్క్ మొదలవడానికి కాసేపటి ముందే అమర్ కేక్ తినడంతో కడుపు నిండి టాస్క్ లో ఫెయిల్ అయ్యి తప్పుకున్నాడు. ఇక లాస్ట్ లో యావర్, శివాజీ ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ టాక్ లో విన్ అయిన వారికి ఎదో చిన్న లగ్జరీ బడ్జెట్ ఐటమ్స్ గిఫ్ట్ ఇవ్వచ్చు తప్ప, ఎంటెర్టైన్మెంట్ తప్ప పెద్దగా ఒరిగేది ఏమి ఉండదని చెప్పొచ్చు. ఇక ఈ రోజు నుండి జరిగే ప్రతి టాస్క్ కూడా ఇలా ఎంటర్టైన్మెంట్ టాస్క్ లాగే ఉంటాయని సమాచారం.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు