Hi Nanna: స్టార్ హీరోలందరి ఫ్యాన్స్ ను వాడేస్తున్న నాని… వీడు మామూలోడు కాదు.

నేచురల్ స్టార్ నాని టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలు అందరి ఫాన్స్ ను తెగ వాడేస్తున్నాడు. ప్రస్తుతం నాని నటించిన “హాయ్ నాన్న” మూవీ రిలీజ్ కు రెడీగా ఉంది. శౌర్యువ్ దర్శకత్వం వహించిన ఈ ఎమోషనల్ అండ్ లవ్ ఎంటర్టైనర్ ను థియేటర్లలో వీక్షించడం కోసం టాలీవుడ్ సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ భామ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, బేబీ కియారా ఖన్నా నాని కూతురుగా నటిస్తోంది. ప్రస్తుతం సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో నాని తలమునకలై ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే నాని టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలందరి అభిమానులను తన సినిమా కోసం వాడేసుకుంటున్నాడు.

వరుసగా స్టార్ హీరోలతో కలిసి ఇంటర్వ్యూలు ప్లాన్ చేస్తూ ఆ స్టార్స్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటున్నాడు. ఇటీవల ‘యానిమల్’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో తన ప్రమోషన్స్ ను కొత్తగా స్టార్ట్ చేశాడు నాని. అనంతరం సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తో కూడా ఇంటర్వ్యూ ప్లాన్ చేసి వదిలిన విషయం తెలిసిందే. ఇక తాజాగా నాని యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం అది వైరల్ అవుతుంది. “హాయ్ నాన్న” మూవీ ప్రమోషన్స్ లో భాగంగా నెటిజన్లతో సోషల్ మీడియాలో ఇంటరాక్ట్ అయిన నాని ఓ నెటిజన్ ప్రశ్నకు సమాధానంగా ఆ ఫోటోను పోస్ట్ చేశాడు.

తారక్ తో కలిసి ఉన్న ఫోటో ఏదైనా పోస్ట్ చేయమని నెటిజన్ కోరగా, నాని తారక్ ని హగ్ చేసుకున్న ఫోటోను పోస్ట్ చేసి ఇది ఓకేనా? అని ప్రశ్నించాడు. ఆ పిక్ చూసిన తారక్ ఫ్యాన్స్ తమ అభిమాన నటుడితో నాని అంత క్లోజ్ గా ఉండడం చూసి తెగ మురిసిపోతున్నారు. మొత్తానికి ఇండస్ట్రీలో ఉన్న ముగ్గురు స్టార్స్ అభిమానులను తన వైపుకు తిప్పుకుని “హాయ్ నాన్న” మూవీ ప్రమోషన్స్ ను మరో లెవెల్ కు తీసుకెళ్లాడు నాని. ఇలా ఈ మూవీ సక్సెస్ కు తన వంతు కృషి చేస్తున్నాడు. ఇక ప్రమోషన్స్ విషయంలో ఈ హీరో ప్లాన్స్ ఎప్పుడు ట్రెండీ గానే ఉంటాయి. ప్రస్తుతం “హాయ్ నాన్న” మూవీ ప్రమోషన్స్ స్టంట్స్ చూసి సినీ విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోతున్నారు. నాని జోష్, అందరు హీరోల అభిమానులను కలుపుకుంటూ వెళ్తున్న తీరును చూస్తుంటే మూవీ హిట్ పక్కా అన్పిస్తోంది. కాగా “హాయ్ నాన్న” మూవీ డిసెంబర్ 7న థియేటర్లలోకి రానుంది.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు