Tripti Dimri: తెలుగోళ్ల కంట పడింది… తృప్తికి ఒక తిరుగులేదు

యానిమల్ మూవీ బాక్సాఫీస్ మీద పంజా విసిరింది. వరల్డ్ వైడ్‌గా యానిమల్ మూవీ 4 రోజుల్లో 425 కోట్లను వసూళ్లు చేసి.. బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుంది. రేపటితో యానిమల్ 500 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయం అని తెలుస్తుంది. ఈ సినిమాతో రణబీర్ కపూర్ వైల్డ్ యాక్టింగ్‌కు… రష్మిక ఫర్మామెన్స్‌కు… సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌కు మంచి క్రేజ్ వస్తుంది. వీరితో పాటు మరో సైలెంట్‌గా మరో పేరు తెరపైకి వస్తుంది. అది ఎవరు అంటే… సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా నటించిన తృప్తి దిమ్రి.

త్రిప్తి యానిమల్ మూవీకి ముందు 5 సినిమాల్లో కనిపించింది. కానీ, యే ఒక్క సినిమా కూడా తృప్తికి మంచి పేరు తీసుకురాలేకపోయింది. కానీ, యానిమల్ సినిమాలో కనిపించింది కొంత సేపు అయినా, ఆడియన్స్ మొత్తం ఆమె గురించి మాట్లాడుకునేలా చేసింది. మెయిన్ లీడ్ రష్మికకు పోటీ తృప్తి ఫర్మామెన్స్ ఉందనే టాక్ కూడా వచ్చింది. అలాగే రణబీర్ తో రొమాన్స్ సీన్స్ లో తృప్తి యాక్టింగ్ కు ఆడియన్స్ ఫిదా అయిపోయారు.

అందుకే గత రెండు రోజుల నుంచే త్రిప్తి ట్విట్టర్ ట్రెండింగ్ లో ఉంది. అయితే తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం… తృప్తికి టాలీవుడ్ తలుపులు తెరుచుకున్నాయట. కొంత మంది దర్శక నిర్మాతలు ఇప్పటకు తృప్తితో చర్చలు జరుపుతున్నారని టాక్. అన్ని కుదిరితే.. తృప్తి తెలుగు తెరపై కనిపించడానికి ఎక్కువ టైం పట్టకపోవచ్చు.

- Advertisement -

హీరోయిన్ పాత్రలే కాకుండా, తృప్తితో స్పెషల్ సాంగ్స్ కూడా చేయించే ఆలోచనలో తెలుగు డైరెక్టర్లు ఉన్నారట. మరీ తృప్తి కేవలం హీరోయిన్ రోల్స్ మాత్రమే చేస్తుందా? లేదా… వచ్చిన ప్రతీ అవకాశాన్ని అందుకుంటుందా అనేది చూడాలి మరి.

Get the latest celebrity news updates, Bollywood movie updates, and the latest news in Tollywood here at Filmify. Also, grab Filmify for the latest movie release dates & Tollywood gossip news, etc.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు