Hi Nanna : నో పెయిడ్ ప్రీమియర్స్… నాని భయపడుతున్నాడా?

నేషనల్ స్టార్ నాని హీరోగా నటించిన “హాయ్ నాన్న” మూవీ మరో రెండు రోజుల్లో సిల్వర్ స్క్రీన్ పైకి రాబోతోంది. శౌర్యువ్ దర్శకత్వంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన “హాయ్ నాన్న” మూవీ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా ఉండబోతోంది. తండ్రి, కూతుర్ల అనుబంధం నేపథ్యంలో ఫ్యామిలీ అండ్ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న “హాయ్ నాన్న” మూవీలో నాని కూతురుగా బేబీ కియార ఖన్నా కనిపించబోతోంది. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ తో సినిమాపై మంచి హైప్ క్రియేట్ కాగా సినిమా రిలీజ్ గురించి నాని అభిమానులంతా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో పెయిడ్ ప్రీమియర్స్ ఉంటాయని భావిస్తున్న అందరికీ షాక్ ఇస్తూ ఓ న్యూస్ బయటకు వచ్చింది.

“హాయ్ నాన్న” మూవీకి సంబంధించిన పెయిడ్ ప్రీమియర్స్ ఉండబోవట. నిజానికి సినిమాపై బాగా నమ్మకం ఉన్నవారు పెయిడ్ ప్రీమియర్స్ వేసే ధైర్యం చేస్తారు. రీసెంట్ గా “మంగళవారం” సినిమాకు అలాగే పెయిడ్ ప్రీమియర్స్ వేసి, సినిమాపై తమకున్న నమ్మకాన్ని ప్రూవ్ చేశారు మేకర్స్. అయితే ఇప్పటిదాకా “హాయ్ నాన్న” పెయిడ్ ప్రీమియర్స్ ఉంటాయని ప్రచారం జరగగా, ఇప్పుడు మాత్రం నాని వెనకడుగు వేశాడు అంటూ వస్తున్న వార్తలు చూసి ఈ హీరోకు తన సినిమాపై నమ్మకం లేదా అని ప్రశ్నిస్తున్నారు. కానీ ఏఎంబిలో మాత్రం 6వ తేదీన సాయంత్రం కొన్ని స్పెషల్ షోలు వేయబోతున్నారని సమచారం. అదికూడా కొంతమంది ఇండస్ట్రీ, మీడియాకు చెందిన ప్రముఖులకు మాత్రమేనట.

కానీ “హాయ్ నాన్న” మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో చిత్ర బృందం డిసెంబర్ 6న ఈ చిత్రానికి సంబంధించిన పెయిడ్ ప్రీమియర్స్ ని ప్లాన్ చేస్తున్నట్టుగా అధికారికంగా ప్రకటించింది. ఇప్పుడు మాత్రం పెయిడ్ ప్రీమియర్స్ ట్రెండ్ ను పక్కన పెట్టేసి ముందుకు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక ఈ మూవీ మంచి కలెక్షన్స్ రాబడుతుందని, అలాగే అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నాని ఆశిస్తున్నారు. కానీ హీరోయిన్ మృణాల్ మాత్రం సినిమా ప్రమోషన్స్ కు హాజరు కాకపోవడం నాని ఫ్యాన్స్ ను నిరాశ పరుస్తోంది. బిజీ షెడ్యూల్ కారణంగా ఆమె ప్రమోషన్స్ కు దూరంగా ఉంటోంది. ఆమె లేకుండానే చిత్రబృందం ఈ చిత్రాన్ని జోరుగా ప్రమోట్ చేస్తోంది. ప్రమోషనల్ మెటీరియల్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది, అలాగే అంచనాలను కూడా పెంచింది. మరి ప్రేక్షకులు నానికి ఎంత వరకు సపోర్ట్ చేస్తారో తెలియాలంటే డిసెంబర్ 7 దాకా వెయిటింగ్ తప్పదు.

- Advertisement -

Check Filmify for the Latest movie news in Telugu and updates from all Film Industries. Also, get the latest Bollywood news, new film updates, Celebrity latest Photos, and gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు