Tollywood heroines: ఈ టాలీవుడ్ హీరోయిన్లలో మరో టాలెంట్.. ఏంటంటే..?

సాధారణంగా ప్రతి ఒక్కరిలో కూడా ఒక హిడెన్ టాలెంట్ ఉంటుందనడంలో సందేహం లేదు. అయితే ఈ క్రమంలోనే మన టాలీవుడ్ హీరోయిన్లలో కూడా మనకు తెలియని సరికొత్త టాలెంట్ వారిలో దాగి ఉంది. మరి ఆ టాలీవుడ్ హీరోయిన్స్ ఎవరు..? వారిలో దాగివున్న ఆ టాలెంట్ ఏంటి!? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం..

రకుల్ ప్రీత్ సింగ్:

Tollywood heroines have another profession along with acting.
ఎప్పుడు ఫిట్ గా కనిపించే ఈ ముద్దుగుమ్మ రకరకాల జిమ్ వర్క్ అవుట్ లను చేస్తూ తన బాడీని ఫిట్ గా మార్చుకున్న విషయం తెలిసిందే. అయితే ఇలా ఫిట్ గా ఉండడానికి కారణం జిమ్ పరికరాలు, వ్యాయామాల పట్ల ఆమెకున్న అవగాహన .. ఇక తను బాడీ బిల్డింగ్, ఫిట్నెస్ ట్రైనింగ్ కూడా ఇవ్వగలరు. తనలో దాగి ఉన్న ఈ టాలెంట్ కారణంగానే హైదరాబాదు, వైజాగ్ లో ఆమె జిమ్ సెంటర్లను నడుపుతోంది.

- Advertisement -

నిత్యామీనన్:

Tollywood heroines have another profession along with acting.
అలా మొదలైంది సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యి .. ఏకంగా ఎనిమిది భాషలు మాట్లాడగలదు. అలాగే అద్భుతంగా పాటలు కూడా పాడుతుంది. ఇప్పటికే ఎన్నో పాటలు పాడిన విషయం తెలిసిందే.

భూమిక:

Tollywood heroines have another profession along with acting.
పవన్ కళ్యాణ్ హీరోయిన్ భూమిక లో కూడా ఒక టాలెంట్ ఉంది. ఆమె నటిగా అద్భుతమైన పర్ఫామెన్స్ ఇవ్వడమే కాదు.. అంతకుమించి కవిత్వం కూడా రాయగలరు .. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హిందీలో సాహిత్య ప్రతిభను కనబరుస్తూ ఉంటుంది.

అనుష్క:

Tollywood heroines have another profession along with acting.
సూపర్ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అనుష్క యోగాలో ప్రావీణ్యం సాధించింది. కొన్నాళ్లు ట్రైనింగ్ కూడా ఇచ్చింది. అయితే సినిమాల్లోకి వచ్చాక అవన్నీ మానేసిన ఈమె.. టీచింగ్ కూడా చేయగలదు.

రితికా సింగ్:

Tollywood heroines have another profession along with acting.
అదిరింది చిత్రంతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్న రితికా సింగ్ తెలుగులో గురు సినిమాతో మరింతగా తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయింది.ఈమెలో ఉన్న టాలెంట్ విషయానికి వస్తే ..ఈమె ఒక మార్షల్ ఆర్టిస్ట్.. సినిమాల్లోకి రావడానికి ముందు స్పోర్ట్స్ లో అదరగొట్టింది. ఆ తర్వాత నటిగా మంచి పేరు కూడా సంపాదించుకుంది.

శ్రీ లీల:

Tollywood heroines have another profession along with acting.
టాలీవుడ్ యంగ్ అండ్ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీ లీల డాన్స్ తో యాక్టింగ్ తో ఇరగదీస్తున్న విషయం తెలిసిందే. ఇక పోతే ఈమె క్లాసిక్ డాన్స్ పై నాలుగేళ్లపాటు శిక్షణ తీసుకుంది. అంతే కాదు భరతనాట్యం కూడా చేయగలదు.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు