Ambati Arjun: లాస్ట్ నామినేషన్ గట్టిగా మనసులో పెట్టుకున్నారు… నెక్స్ట్ వీక్ ఎలాగూ ఉండదుగా?

స్టార్ మా లో టెలికాస్ట్ అవుతున్న బిగ్ బాస్ సీజన్ 7 లో సోమవారం నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఈ సీజన్లో ఈ వారమే ఆఖరి నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పేసరికి ఎవరికీ వారు తాము నామినేట్ చేయాల్సిన వాళ్ళని గట్టిగా చేయాలనీ ఫిక్స్ అయిపోయారు. ఆ ప్రాసెస్ లో వినకపోతే బిగ్ బాస్ బిగినింగ్ డేస్ ముచ్చట్లు తీసి మరీ రుద్దడం మొదలెట్టారు.

ఇక నామినేషన్ ప్రాసెస్ చూసిన వాళ్లకి స్పై వర్సెస్ స్పా బ్యాచ్ వార్ లాగే అనిపించిందన్న మాట వాస్తవం. ఇక అటు ఇటు కాకుండా మధ్యలో సేఫ్ గా ఉండి ఫైనలిస్ట్ అయిన అర్జున్ కూడా ఒక రకంగా స్పా బ్యాచ్ సైడే ఉన్నట్టు అనిపించింది.

అయితే నామినేషన్ లో యావర్ వర్సెస్ అర్జున్, ఇంకా ప్రశాంత్ వర్సెస్ అమర్ వార్ గట్టిగా జరిగింది. ఈ నామినేషన్ కొట్టుకోవడం ఒక్కటే తక్కువ అన్నంత రేంజ్ లో గొడవకి దిగారు. అయితే అర్జున్ యావర్ ని నామినేట్ చేసిన పాయింట్ అస్సలు బాగాలేదని ఆడియన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు.

- Advertisement -

ఇక బిగ్ బాస్ లో నామినేషన్ ప్రాసెస్ ముగిసిన తర్వాత కూడా కంటెస్టెంట్లు కోలుకోలేదని తాజాగా రిలీజ్ అయిన ప్రోమో లో తెలుస్తుంది. నామినేషన్ ముగిసిన తర్వాత దాని గురించి మాట్లాడకూడదు. కానీ హౌస్ లో అన్ని చోట్ల, ఆఖరికి తినే చోట కూడా అదే విషయాన్నీ మాట్లాడుకుంటూ మనసు పాడు చేసుకోవడమే గాక, ఆడియన్స్ దృష్టిలో నెగిటివ్ అవుతున్నారు. ఇక అర్జున్ ఎలాగో సేఫ్ అయ్యాడు కాబట్టి లైట్ తీసుకుంటున్నాడు గాని, టైటిల్ విన్నర్ అయ్యేందుకు తన వ్యక్తిగత ప్రవర్తన కూడా లెక్కలోకి వస్తుందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు