Koushal Manda : పాన్ ఇండియా సినిమాలో బిగ్ బాస్ విన్నర్..!

తెలుగులో అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్‌కు ఏ రేంజ్‌లో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ షోలోకి ఎంట్రీ ఇచ్చిన తరవాత కంటెస్టెంట్ ల పేర్లు జనాల నోర్లలో నానాల్సిందే. అంతేకాదు బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన తరవాత చాలాకాలం పాటు ఫుల్ బిజీగా ఉంటారు. ఇక బిగ్ బాస్ విన్నర్ లకు మిగితా కంటెస్టెంట్ ల కంటే క్రేజ్ ఎక్కువగానే ఉంటుంది. ఇదిలా ఉంటే తెలుగు బిస్ చ‌రిత్రలో సీజ‌న్ 2కు ఎంతో ప్ర‌త్యేక‌త ఉంది. ఈ సీజ‌న్ లో న‌టుడు కౌశ‌ల్ మండ విన్న‌ర్ గా నిలిచాడు. కౌశ‌ల్ కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగుపెట్టిన త‌రవాత ఎంతో మంది అభిమానుల‌ను సంపాదించుకున్నాడు.

ముఖ్యంగా కౌశల్ ను ఇతర కంటెస్టెంట్ లు కార్నర్ చేయడంతో చాలా సింపతీ వచ్చింది. ఆ సింపతీతో కుప్పలు కుప్పలుగా వచ్చాయి. హౌస్ బటయ కౌశల్ పేరు పై ఫ్యాన్ పేజీలు క్రియేట్ చేసి అభిమానులు రచ్చ చేశారు. అంతే కాకుండా కౌశల్ కోసం బయట ర్యాలీలు కూడా తీయడం విశేషం. బిగ్ బాస్ హిస్టరీలోనే ఓ కంటెస్టెంట్ కోసం ఎప్పుడూ ర్యాలీలు ఫ్యాన్ పేజీలు క్రియేట్ అవ్వలేదు. అయితే బిగ్ బాస్ తరవాత అందరూ కౌశల్ మండ సినిమాల్లో రానిస్తాడని అనుకున్నారు. కానీ అలా జరగలేదు….అంతే కాకుండా కౌశల్ హీరోగా సినిమా రాబోతుందంటూ రకరకాల వార్తలు పుట్టుకొచ్చాయి. కానీ ఆ వార్తల్లో నిజం లేదని ఆ తరవాత తెలిసింది.

ఇక బిగ్ బాస్ సీజన్ 2 పూర్తయ్యి చాలా కాలం అవుతున్నా ఇప్పటి వరకూ కౌశల్ నటించిన సినిమాలు రాలేదు. కాగా తాజాగా అభిమానులకు కౌశల్ కిక్ వచ్చే న్యూస్ చెప్పాడు. త్వరలో తాను పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నానని చెప్పాడు. ఆ సినిమాను దాదాపు రూ.250 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారని వెల్లడించారు. అంతే కాకుండా ఆ సినిమాలో ఓ యంగ్ హీరో నటిస్తున్నాడని పేర్కొన్నారు. ఇక మరి ఈ సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాలి. అంతే కాకుండా బిగ్ బాస్ సమయంలో కౌశల్ కు సపోర్ట్ చేసిన అభిమానులు సినిమాకు సపోర్ట్ చేస్తారా లేదా చూడాలి.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు