Bigg Boss Telugu 7: రైతు బిడ్డ పెళ్లి… ప్రశాంత్ ను పెళ్లాడబోయే అమ్మాయి ఎవరంటే?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడా? అంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం ఎస్ అనే వినిపిస్తోంది. మరి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ పాపులర్ అయిన ఈ రైతు బిడ్డను పెళ్లాడబోయే ఆ అమ్మడు ఎవరు? అనే వివరాల్లోకి వెళితే…

ప్రస్తుతం ఎక్కడ చూసినా పల్లవి ప్రశాంత్ పేరే మార్మోగిపోతోంది. రైతు బిడ్డగా బిగ్ బాస్ సీజన్ సెవెన్ తెలుగులోకి అడుగుపెట్టిన ప్రశాంత్ ప్రాణమైన శైలిలో గేమ్ ఆడి ఎంతోమంది బుల్లితెర ప్రేక్షకుల మనసును దోచుకున్నాడు. దానికి ఫలితంగానే ఫైనల్ గా భారీ ఓట్ల మెజారిటీతో టైటిల్ విన్నర్ గా నిలిచాడు. దీంతో ఒక సామాన్య కంటెస్టెంట్ బిగ్ బాస్ విన్నర్ గా నిలిచి చరిత్ర సృష్టించడం సంచలనంగా మారింది. అయితే హౌస్ లో పల్లవి ప్రశాంత్ కి నెగటివ్ గా మాట్లాడిన కంటెస్టెంట్స్ ను షో ముగిసినప్పటికీ ట్రోల్ చేయడం మానలేదు జనాలు.
ఇక సీజన్ 7 గ్రాండ్ ఫినాలే అనంతరం ప్రశాంత్ అభిమానులు ఏకంగా ఇతర కంటెస్టెంట్లకు కార్లపై రాళ్లతో దాడి చేయడం కూడా చర్చకు దారి తీసింది. ఇక ఆ విషయాన్ని పక్కకు పెట్టి అసలు విషయంలోకి వెళ్తే, ప్రశాంత్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు అన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
గతంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో ప్రశాంత్ తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ కొడుకుకు అంత సంపాదిస్తున్నాడు ఇంత సంపాదిస్తున్నాడు అంటూ ప్రచారం జరుగుతోందని, అదంతా నిజం కాదని, తాము కేవలం మట్టిని నమ్ముకుని బతుకుతున్నామని, తమపై లేనిపోని నిందలు వేయొద్దని కోరారు. అంతేకాకుండా ఇక పల్లవి ప్రశాంత్ కు పెళ్లి చేయాలనే ఆలోచనలో తాము ఉన్నామని, హౌస్ నుంచి బయటకు రాగానే పెళ్లి చేసేస్తామని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఇదే విషయాన్ని తెరపైకి తీసుకొస్తూ వాళ్లు అన్నట్టుగానే ప్రశాంత్ బిగ్ బాస్ హౌస్ లో నుంచి బయటకు వచ్చాడు.
అది కూడా టైటిల్ విన్నర్ గా. ఇక ఇదే మంచి సమయం కాబట్టి అతని తల్లిదండ్రులు ప్రశాంత్ కు పెళ్లి చేసే అవకాశం ఉంది అని టాక్ నడుస్తోంది. మరి పల్లవి ప్రశాంత్ పెళ్లాడబోయే ఆ అమ్మాయి ఎవరు ? అంటే దానికి కూడా సమాధానం ఇచ్చేస్తున్నారు నెటిజన్లు. ప్రశాంత్ కు సొంత మరదల్ని ఇచ్చి అతని తల్లిదండ్రులు పెళ్లి చేయబోతున్నారు అని ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనే విషయం ప్రశాంత్ తన పెళ్లి విషయంపై రియాక్ట్ అయితే గాని తెలియదు.
Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు