Hanuman: అదరగొట్టేస్తున్న తేజ సజ్జా హనుమాన్ ట్రైలర్..!!

తెలుగు సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రాలలో హనుమాన్ సినిమా కూడా ఒకటి.. ఈ సినిమాను తెలుగులో సూపర్ హీరో మూవీగా తెరకెక్కించడంతో భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. గతంలో జాంబిరెడ్డి వంటి చిత్రాలను తెరకెక్కించిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో ఈ సినిమా పైన మరింత అంచనాలు పెరుగుతున్నాయి. అంతేకాకుండా హీరోగా తేజ సజ్జా ఈ చిత్రంతో పాన్ ఇండియా హీరోగా రాబోతున్నారు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ కూడా విడుదల కావడం జరిగింది.. వాటి గురించి తెలుసుకుందాం.

ఈ సినిమా ట్రైలర్ విషయానికి వస్తే.. ఈ చిత్రం మొత్తం హనుమంతుడి కథాంశం తో చిత్రీకరించినట్లుగా కనిపిస్తోంది. అద్భుతమైన గ్రాఫిక్స్ తో లొకేషన్స్ లో ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకునే విధంగా కనిపిస్తోంది. ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్ తేజ సజ్జా అక్కగా నటించబోతోంది. ఈ సినిమా కూడా సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కించినట్లు కనిపిస్తోంది. గెటప్ శ్రీను తదితర నటీనటులు సైతం ఇందులో నటిస్తున్నారు.. ముఖ్యంగా హనుమంతుడి యొక్క బలం గురించి ఈ చిత్రంలో చూపించారు . దాదాపుగా 11 భాషలలో ఈ సినిమా ట్రైలర్ ని కూడా విడుదల చేశారు చిత్ర బృందం.

వచ్చే ఏడాది జనవరి 12వ తేదీన ఈ సినిమా విడుదల చేయబోతున్నారు. గతంలో ఎప్పుడూ చూడని విధంగా సినిమాటిక్ అద్భుతాన్ని ఈ ట్రైలర్ లో చూపించారని చెప్పవచ్చు. హనుమంతుడికి ఇష్టమైన ఈ మంగళవారం రోజునే ట్రైలర్ ని కూడా విడుదల చేశారు చిత్ర బృందం. హనుమంతుడి శక్తుల వల్ల సూపర్ హీరోగా మారిన యువకుడి కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తున్నది. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.

- Advertisement -

హనుమాన్ సినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్గా నటిస్తోంది.ట్రైలర్ తో అదరగొట్టేస్తున్న తేజ సజ్జా మరి ఏ మేరకు ఈ సినిమాతో అదరగొట్టేస్తారో తెలియాలి అంటే ఈ సినిమా విడుదల అయ్యే వరకు ఆగాల్సిందే..

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు