Venkatesh Maha : ప్రభాస్ ఫ్యాన్స్ దెబ్బకు డైరెక్టర్ అకౌంట్ డిలీట్

కేరాఫ్ కంచరపాలెం దర్శకుడు వెంకటేష్ మహా ఇటీవల కాలంలో ఎక్కువగా వివాదాల్లో నిలుస్తున్నాడు. గతంలో “కేజిఎఫ్ 2” మూవీపై సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన డైరెక్టర్ వెంకటేష్ మరోసారి అదే దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న “సలార్” మూవీ విషయంలో కూడా కొత్త కాంట్రవర్సీకి తెర తీశాడు. ఇంతకీ అతను ఏం చేశాడంటే…

కేజిఎఫ్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో, ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ “సలార్”. అయితే మరోవైపు ఈ మూవీకి పోటీగా బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ హీరోగా నటిస్తున్న “డంకీ” మూవీ రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒకవైపు తెలుగులో ఇంత పెద్ద భారీ చిత్రం విడుదల అవుతుంటే, డైరెక్టర్ వెంకటేష్ మహా మాత్రం “డంకీ” మూవీనీ ఫస్ట్ డే చూడడానికి ఆసక్తిని కనబరిచాడు. దానికి సంబంధించిన టికెట్ ఫోటోలు కూడా ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. నిజానికి ఈ దర్శకుడు టాలీవుడ్ కు చెందినవాడన్న విషయం తెలిసిందే. అయినప్పటికీ ఆయన ఒక హిందీ సినిమాను ఫస్ట్ డే చూడడానికి ఆసక్తిని కనబరచడం సౌత్ ఆడియన్స్ కు నచ్చలేదు. దీంతో సోషల్ మీడియా వేదికగా ఆయనను ఓ ఆట ఆడేసుకున్నారు నెటిజన్లు. వీళ్ళ టార్చర్ భరించలేక వెంటనే తన అకౌంట్ ను డిలీట్ చేశాడు ఈ డైరెక్టర్.

అంతకంటే ముందు డైరెక్టర్ వెంకటేష్ మహా తన తప్పును కవర్ చేసుకోవడానికి సుదీర్ఘ వివరణతో ఒక పోస్ట్ చేశాడు. అందులో “ఇక కూల్ అవ్వండి. మీరేదో పొరబడుతున్నారు. నేను చేసిన ఆ పోస్ట్ లో డంకీ కోసం నేను ఎంత ఉత్సాహంగా ఉన్నాను అనే విషయాన్ని పంచుకోవాలని మాత్రమే అనుకున్నాను. అయితే మీకు కామెంట్స్ చూసాకనే సలార్ ట్రైలర్ విడుదలైందని నాకు తెలిసింది. నిజా నిజాలు తెలియకుండా మాట్లాడడం మానేయండి. నేను కూడా ఫస్ట్ మూవీ నుంచి ప్రభాస్ కు పెద్ద అభిమానిని. ఆయనతో కలిసి పని చేయాలని కోరుకుంటాను. నేను ఈ విషయాన్ని బయట ఎక్కువగా చెప్పకపోవచ్చు. సలార్ ట్రైలర్ ను చూశాను. అద్భుతంగా ఉంది. ప్రతి విషయాన్ని వివాదంగా మార్చొద్దు. ఇక నా విషయాన్ని పక్కకు పెట్టి కొనసాగాల్సిన సమయం ఆసన్నమైందని నేను భావిస్తున్నాను” అంటూ పోస్ట్ చేశాడు. అయినప్పటికీ ప్రభాస్ ఫ్యాన్స్, ప్రశాంత్ నీల్ ఫ్యాన్స్ ఇతన్ని టార్గెట్ చేయడం ఆపకపోవడంతో ఆయన ఏకంగా తన సోషల్ మీడియా ఖాతా అయినా ట్విట్టర్ అకౌంట్ ని డి ఆక్టివేట్ చేశాడు.

- Advertisement -

ఇక గతంలో ఈ దర్శకుడు “కేజిఎఫ్” సినిమా పెద్ద గొప్ప సినిమా ఏం కాదు అనే విధంగా సంచలనం వ్యాఖ్యలు చేసి యశ్ ఫ్యాన్స్ కోపానికి బలయ్యాడు.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు