Maheshbabu: మహేష్ బాబులో ఈ టాలెంట్ కూడా ఉందా.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్..!

సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ప్రిన్స్ హీరో గా గుర్తింపు తెచ్చుకొని.. ఆ తర్వాత స్టార్ హీరోగా.. ఇప్పుడు సూపర్ స్టార్ గా చలామణి అవుతున్న మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలోకి బాలనటుడిగా అడుగుపెట్టి.. ఆ తర్వాత మొదటి సినిమాతోనే తన మార్క్ చూపిస్తూ స్టార్ అయ్యేందుకు అడుగులు వేశారు. కెరియర్ ప్రారంభంలో మహేష్ బాబు పడిన కష్టం మామూలుది కాదు.. సినీ బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్ ఉన్నప్పటికీ కూడా ఒక సాధారణ వ్యక్తి లాగా కష్టపడి తనను తాను నిరూపించుకున్నాడు. అంతేకాదు తన సినిమాలో స్క్రిప్ట్ ని కూడా సొంతంగా తానే ఎంచుకోవడం మొదలుపెట్టాడు.

కృష్ణ ప్రమేయం లేకుండా తన సినిమా నిర్ణయాలను తానే స్వయంగా తీసుకున్నట్లు పలు ఇంటర్వ్యూలలో కూడా చెప్పుకొచ్చారు మహేష్ బాబు. అంతేకాదు తన సినిమా హిట్ అయినా.. ఫ్లాప్ అయినా ఆ చిత్రానికి ఒక విలువ ఉంటుంది. ఆయన స్క్రిప్ట్ ఎంపిక అలాంటిది మరి.. అయితే మరి మహేష్ బాబు డిజాస్టర్ సినిమాల కథేంటి అంటే.. కథ వినగానే దాని ఫలితం కూడా ముందే చెప్పేసే మహేష్ .. పూర్తి స్క్రిప్ట్ వినకుండా డైరెక్టర్స్ మీద గుడ్డి నమ్మకంతో చేసినవే ఫ్లాప్ మూవీస్ గా మిగులుతాయి. ఇక ఇదంతా పక్కన పెడితే మహేష్ బాబులో కేవలం యాక్టింగ్ నైపుణ్యమే కాదు దర్శకత్వ నైపుణ్యం కూడా ఉందట.

ఒక సినిమాకి ఆయనే స్వయంగా దర్శకత్వం వహించినట్లు సమాచారం. ఆ చిత్రం ఏదో కాదు మహేష్ బాబు పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన పోకిరి సినిమా.. ఈ సినిమా కథని ముందుగా పవన్ కళ్యాణ్ తోపాటు రవితేజ కి కూడా వినిపించారు. కానీ వారిద్దరూ సినిమాను రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత మహేష్ బాబు వద్దకు ఈ సినిమా కథ వెళ్తే.. స్క్రిప్ట్ లో చాలా సన్నివేశాలను మహేష్ బాబు మార్పించడం జరిగింది. హైదరాబాద్ రూరల్ బ్యాక్ గ్రౌండ్ లో ఈ సినిమాను తీస్తే బాగుంటుందని కూడా సూచించాడట.

- Advertisement -

అలాగే క్లైమాక్స్లో పండుగాడు పోలీస్ ఆఫీసర్ అనే ట్విస్ట్ పెట్టే ఆలోచన కూడా మహేష్ బాబుదే అని.. అలాగే ప్రతి సన్నివేశాన్ని కూడా ప్రత్యేకంగా దర్శకత్వ పర్యవేక్షణ చేసేవాడట మహేష్ బాబు. ఇక అలా ఆయన దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చింది కాబట్టి ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుందని సమాచారం. ఇకపోతే మహేష్ బాబు లో ఉన్న ఈ టాలెంట్ ని చూసి అభిమానులు సైతం ఫిదా అవుతున్నారు.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు