కెరియర్ లో మొదటిసారి

తమిళంలో చాలా తక్కువ సినిమాలతోనే ‘లెజెండరీ’ స్టేటస్ అందుకున్న దర్శకుడు సెల్వ రాఘవన్. గత ఆరేడేళ్లలో సెల్వ నుంచి వచ్చిన సినిమాలేవీ ఆకట్టుకోలేదు. ఎన్నో అంచనాల మధ్య సూర్య హీరోగా వచ్చిన ‘ఎన్జీకే’ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.

కాదల్ కొండేన్, 7/జి బృందావన కాలనీ, ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, మయక్కం ఎన్న లాంటి క్లాసిక్స్‌తో అతడికి చాలా గొప్ప పేరే వచ్చింది. ఐతే తన మీద ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలను తర్వాత కాలంలో అతను అందుకోలేకపోయాడు

ఇప్పుడు నటుడిగా ముందడలు వేస్తున్నాడు సెల్వ,
లుక్స్ పరంగా చూస్తే సెల్వ డిఫరెంటుగా ఉంటాడు. అతను బాగా రిజర్వ్డ్ కూడా. ఎప్పుడూ ముభావంగా కనిపిస్తాడు. అలాంటి వాడు నటుడు కావడమేంటి అని ప్రేక్షకులు అయోమయంలో పడిపోయారు బీస్ట్ సినిమా ముందు వరకు.
కానీ బీస్ట్ సినిమా చూసాక ఆడియన్స్ కి సెల్వ పై ఒక క్లారిటీ వచ్చింది.
కీర్తి సురేష్ , సెలవ్ రాఘవన్ కాంబినేషన్లో అరుణ్ మతేశ్వరన్ అనే యువ దర్శకుడు ‘సాని కాయిదమ్’ అనే సినిమా చేసారు ఈ సినిమా మే 6 న అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది.

- Advertisement -

ఇన్నాళ్లు దర్శకుడిగా తన సొంతకథలనే డైరెక్ట్ చేసిన సెల్వరాఘవన్ ఫస్ట్ టైం తన సోదరుడు ధనుష్ రాసిన “నాన్ వరువేన్”అనే సినిమాకి దర్శకత్వం చేయబోతున్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు