ఏమైంది అన్నగారు.?

బండ్ల గణేష్ పరిచయం అవసరం లేని పేరు ఇది
ఉన్నదీ ఉన్నట్లుగా మాట్లాడే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీర అభిమాని,
మెగా ఫ్యామిలీని కానీ , మెగా వారసులను కానీ ఏమైనా అంటే క్షణాల్లో రియాక్ట్ అయి తన ప్రేమను వ్యక్తపరుస్తారు గణేష్.

ఒక మాములు నటుడిగా ప్రయాణాన్ని మొదలుపెట్టిన గణేష్ కెరియర్ లో
ఎన్నో ఒడిదుడుకులు , మర్చిపోలేని విమర్శలు , మర్చిపోకూడని ప్రశంసలు ఉన్నాయ్. కేవలం చిరంజీవిని చూడటం కోసం హైదరాబాద్ కు వచ్చి , చిరు తనయుడుతో సినిమా తీసే రేంజ్ కు ఎదిగిన గణేష్ ప్రయాణం కొందరికి ఆదర్శం అని కూడా చెప్పొచ్చు. న‌టుడిగా సినిమాలే ఆపేసి పూర్తి స్థాయిలో నిర్మాత అవ‌తారం ఎత్తిన ఆయన.. ఈ మ‌ధ్య‌నే స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమాతో కామెడీ పాత్ర‌తో రీఎంట్రీ ఇచ్చాడు.

రీసెంట్ గా ఒక ప్రముఖ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన బండ్ల గణేష్ ఓ అగ్ర దర్శకుడితో తనకున్న విబేధాలపై కూడా సెటైరిక్ గా స్పందించాడు. దర్శకులంతా నీళ్లలాంటి వాళ్లని, ఇలా వచ్చి అలా పోతారని, “నేను నాగార్జునసాగర్ డ్యామ్ లాంటోడిని. డ్యామ్ లోకి నీరు వస్తుంటాయి, పోతుంటాయి. వాళ్లందరూ ఆ టైపు. నేను బ్యారేజీ లాంటోడ్ని. అక్కడే ఉంటాను. వాళ్లతో నాకు పోలికేంటి.” అని చెప్పుకొచ్చారు.

- Advertisement -

దర్శకుడు హరీష్ శంకర్ పై కూడా పరోక్షంగా విమర్శలు చేశాడు బండ్ల గణేష్ అని రాసిన ఒక వెబ్సైటు లింక్ ను ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ ,
హరీష్ నాకు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ , నా జీవితాంతం ఆయనను గౌరవిస్తాను అని చెప్పారు బండ్ల గణేష్. దీనికి ఏమైంది అన్నగారు హరీష్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా స్పందించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు