దర్శకధీరుడు జక్కన్న చెక్కిన ఆర్ఆర్ఆర్ అనే అద్భతం.. సినిమా ప్రపంచాన్నే షాక్ కు గురి చేసే విధంగా ప్రకంపనలు సృష్టించింది. మార్చి 25న రిలీజ్ అయిన ఈ మూవీ.. పలు రికార్డులను తన ఖాతాలో వేసుకుంటూ దూసుకెళ్లింది. తెలుగులో బాహుబలి తర్వాత.. ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చిన మూవీ ఆర్ఆర్ఆర్ నే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. రిలీజ్ అయిన 40 రోజులు అవుతున్నా.. ఏ మాత్రం జోెష్ తగ్గలేదు.
అయితే ఈ మధ్య కాలంలో ఈ మూవీలోని ఫుల్ వీడియో సాంగ్స్ ను యూట్యూబ్ లో అప్ లోడ్ చేస్తున్నారు. ఇప్పటికే దోస్తీ, నాటు నాటు, ఎత్తర జెండా.. సాంగ్స్ ను యూట్యూబ్ ప్రసారం అవుతున్నాయి. తాజా గా కొమురం భీముడో.. ఫుల్ సాంగ్ ను రేపు సాయంత్రం 4 గంటలకు యూట్యూబ్ కనిపించబోతుంది. ఈ విషయాన్ని లహరి మ్యూజిక్ ట్విట్టర్ వేదికగా.. అధికారికంగా ప్రకటించింది.
కాగ కొమురం భీముడో.. సాంగ్ థియేటర్స్ లో ఎంత రచ్చ చేసిందో ప్రత్యేక చెప్పాల్సినవసరం లేదు. ఈ సాంగ్ లో తారక్ నటనకు సినీ లవర్స్ ఫీదా అయిపోయారు. నిజంగా చెప్పాలంటే.. ఆర్ఆర్ఆర్ మూవీకి కొమురం భీముడో.. పాటే హైలైట్ అని చెప్పవచ్చు. అలాంటి సాంగ్ యూట్యూబ్ లో ప్రత్యేక్షం అయితే.. రికార్డు స్థాయిలో వ్యూస్, లైక్స్ ఖాయం.