సెంటిమెంట్ కి త్రివిక్రమ్ చెక్..?

“సర్కారు వారి పాట”
రీసెంట్ గా రిలీజైన ఈ ట్రైలర్ మహేష్ అభిమానులకి ఒక మాస్ ట్రీట్.
పోకిరి , ఖలేజా , దూకుడు వైబ్స్ వచ్చాయి ఈ ట్రైలర్ చూడగానే.
ఇంతకు ముందు సినిమాల్లో కొంచెం సెట్టిల్డ్ గా చేసిన మహేష్ ఈ సినిమాలో తనలోని టైమింగ్ , బాడీ లాంగ్వేజ్ ను పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేసాడు. మే 12 న రిలీజ్ కాబోయే ఈ సినిమాకి ప్రొమోషన్స్ షురూ చేయనున్నారు మూవీ టీం.మే 7 న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు.

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు త్రివిక్రమ్ , పూరి జగన్నాధ్ , ఎస్ ఎస్ రాజమౌళి హాజరవుతారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. వీటికి కారణాలు కూడా లేకపోలేదు. సర్కారు వారి పాట సినిమాకి దర్శకత్వం వహించిన పరశురామ్ ఇదివరకే దర్శకుడు పూరి దగ్గర వర్క్ చేసాడు. దానికి తోడు పూరి కూడా మహేష్ తో రెండు హిట్ సినిమాలు చేసారు. ఇక రాజమౌళి విషయానికి వస్తే మహేష్ తో రాజమౌళి సినిమా ఉండబోతుంది కాబట్టి రాజమౌళి కూడా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరయ్యే అవకాశం ఉంది. సర్కారు వారి పాట సినిమా తరువాత మహేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమాని చేయనున్నారు. వీళ్ళతో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరవుతారు అనే మాటలు వినిపిస్తున్నాయి. కానీ ఇక్కడే కొన్ని సందేహాలు తలెత్తుతున్నాయి.

భీష్మ సినిమా మినహాయిస్తే ఇప్పటివరకు త్రివిక్రమ్ ముఖ్య అతిధిగా హాజరు అయినా ఏ సినిమా కూడా అనుకున్న స్థాయిలో ఆడలేదు. సర్ధార్ గబ్బర్ సింగ్, లై , కాటం రాయుడు, వినయ విధేయ రామ, రెడ్ , ఇచట వాహనములు నిలపరాదు, రంగదే లాంటి కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టినవే. బేసిక్ గా ఇండస్ట్రీ లో సెంటిమెంట్స్ ను ఎక్కువ నమ్ముతారు. అసలు త్రివిక్రమ్ ఈ ఫంక్షన్ కి వస్తారా, రారా అనే దానిపై ఇంకా ఆఫీసియల్ అనౌన్సమెంట్ రాలేదు. ఒకవేళ త్రివిక్రమ్ హాజరై సినిమా హిట్ అయితే కొన్ని సెంటిమెంట్స్ కి త్రివిక్రమ్ చెక్ పెట్టినట్లే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు