‘మైత్రీ’ కొనసాగిస్తున్న శ్రీమంతుడు..!

టాలీవుడ్ లో ప్రస్తుతం ఫుల్ బిజీ గా ఉన్న నిర్మాణ సంస్థల్లో మైత్రీ మూవీ మేకర్స్ ఒకటి. సూపర్ స్టార్ మహేష్ బాబు శ్రీ మంతుడు సినిమాతో పరిచయం అయిన ఈ సంస్థ.. ఇప్పటి వరకు 11 సినిమాలను నిర్మించింది. అలాగే ప్రస్తుతం సర్కారు వారి పాట, అంటే సుందరానికి, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, ఎన్ బీ కే 107, పుష్ప పార్ట్  2, వాల్తేరు వీరయ్య తో పాటు విజయ్ దేవరకొండ, సమంత మూవీని కూడా నిర్మిస్తుంది. 

అయితే టాలీవుడ్ లో సక్సస్ ఫుల్ గా రాణిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్.. ఒక్క హీరోను మాత్రం విడిచిపెట్టడం లేదు. తొలి సినిమాతోనే సూపర్ కలెక్షన్లు అందించిన సూపర్ స్టార్ మహేష్ బాబు తో మైత్రీ మూవీ మేకర్స్.. మైత్రీ కొనసాగిస్తూనే ఉంది. ఇప్పటి వరకు ప్రిన్స్ తో శ్రీ మంతుడుతో పాటు సర్కారు వారి పాటలను నిర్మించిన ఈ సంస్థ మరో మూవీని నిర్మించడానికి సై అంటోదట.

సూపర్ మహేష్ బాబు.. ప్రస్తుతం సర్కారు వారి పాట మూవీ బిజీ లో ఉన్నాడు. ఈ నెల 12న రిలీజ్ కానున్న ఈ మూవీ కోసం ప్రమోషన్స్ ను కూడా స్టార్ట్ చేయబోతున్నాడు. సర్కారు వారి పాట తర్వాత ప్రిన్స్.. దర్శకదీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ తోనూ  సినిమా చేయనున్నాడు. 

- Advertisement -

ఈ సినిమాల తర్వాత.. మహేష్ మరో ప్రాజెక్ చేయడానికి రెడీ అవుతున్నాడట. ఈ ప్రాజెక్ట్ ను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నట్టు ఇండస్ట్రీ వర్గాల టాక్. దీంతో మైత్రీ మూవీ మేకర్స్ – మహేష్ బాబు మైత్రీ ఇంకా కొనసాగుతూనే ఉందంటూ నెటిజన్లు అంటున్నారు. అయితే ఈ మూవీ.. శ్రీ మంతుడు అంత హిట్ అవుతుందో.. లేదా.. నిరాశ పరుస్తుందో చూడాలి మరి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు