దంగ‌ల్ ఢ‌మాల్

బాలీవుడ్ లో అమీర్ ఖాన్ సినిమాలంటే.. ఎంత క్రేజ్ ఉంటుందో అంద‌ర‌కీ తెలుసు. ఆయ‌న సినిమాలు బాక్సాఫీస్ ను బ‌ద్ద‌లు కొట్టేలా ఉంటాయి. దంగ‌ల్, సీక్రేట్ సూప‌ర్ స్టార్, పీకే సినిమాలు ఎంత పెద్ద హిట్ కొట్టాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన‌వ‌స‌రం లేదు. ప్ర‌పంచ వ్యాప్తంగా అత్య‌ధిక క‌లెక్ష‌న్లు రాబ‌ట్టిన‌ ఇండియాన్ సినిమాల లీస్ట్ లో దంగ‌ల్ రూ. 2,024 కోట్ల‌తో తొలి స్థానంలో ఉండ‌గా.. టాప్ 10 లో సీక్రేట్ సూపర్ స్టార్, పీకే లు ఉన్నాయి.

అయితే దంగ‌ల్ రికార్డ్స్ పై కేజీఎఫ్ – 2 క‌న్నేసింది. ఇప్ప‌టికే చిన్న చిన్న రికార్డుల‌ను త‌న ఖాతాలో వేసుకున్న రాకీ భాయ్.. మ‌రో రికార్డును వ‌శం చేసుకున్నాడు. హిందీ రాష్ట్రాల్లో అత్య‌ధిక క‌లెక్ష‌న్లు రాబ‌ట్టిన లీస్ట్ లో దంగ‌ల్ ను కేజీఎఫ్-2 దాటేసింది. మొద‌టి స్థానంలో రూ. 510 కోట్ల‌తో బాహుబ‌లి ది క‌న్ క్లూజ‌న్ ఉంది. కేజీఎఫ్ – 2 రూ. 400 కోట్ల‌తో రెండో స్థానంలో తాజా గా చేరింది. కాగ ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన దంగ‌ల్ మాత్రం.. హిందీ బెల్ట్ లో కేవ‌లం రూ. 382 కోట్ల‌తో మూడో స్థానంలో ఉంది.

అయితే ఒక సౌత్ మూవీ.. హిందీ రాష్ట్రాలను ఏలేయ‌డం.. నిజంగా అశ్చ‌ర్య‌మే అని చెప్పాలి. కొద్ది రోజుల క్రితం హిందీ ప్రేక్ష‌కులు.. సౌత్ మూవీల‌పై ఇంట్రేస్ట్ చూపించే వారు కాదు. కానీ జ‌క్క‌న బాహుబ‌లి, ఆర్ఆర్ఆర్ సినిమాల నుంచి నార్త్ లో కూడా సౌత్ సినిమాలపై అసక్తి పెరిగింది. తాజా గా కేజీఎఫ్2 తో రికార్డ్ లను బద్దలు కొట్టేంత వరకు వచ్చింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు