బాహుబలి చిత్రం తో తెలుగు సినిమా ను పాన్ ఇండియా రేంజ్ కు తీసుకెళ్లిన రాజమౌళి దర్శకత్వంలో ఆ తరువాత విడుదల అయిన చిత్రం ఆర్.ఆర్.ఆర్. ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ముఖ్య పాత్రల్లో నటించారు. వీరితో పాటు ఆలియా భట్, అజయ్ దేవగన్, శ్రియ శరన్, ఒలీవియా వంటి ఎంతో మంది స్టార్స్ ఈ సినిమా లో నటించారు. సినిమా ప్రపంచాన్నే తనవైపునకు తిప్పుకున్న ఆర్ఆర్ఆర్ 1200 కోట్లకు పైగా కలెక్షన్లు వసూళ్లు చేసింది.
కాగా ఈ చిత్రం ప్రస్తుతం ఆస్కార్ రేస్ లో ఉన్న విషయం తెలిసిందే. బెస్ట్ యాక్టర్, బెస్ట్ పిక్చర్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ , బెస్ట్ స్క్రీన్ ప్లే, బెస్ట్ ఎడిటింగ్ , బెస్ట్ సినిమాటోగ్రఫీ రంగాల్లో ఆస్కార్ కోసం పోటీ పడుతుంది.
అలాగే ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్ ఇప్పటికే ఆస్కార్ నామినేషన్స్ లో షార్ట్ లిస్ట్ అయింది. దీంతో నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ అవార్డ్ రావడం దాదాపు ఖాయమే అని అంతర్జాతీయ సినీ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో నాటు నాటు సాంగ్ మరో అరుదైన ఘనతను సాధించింది. ఇటీవల జరిగిన గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ కు నామినేట్ అయిన విషయం తెలిసిందే.
తాజాగా నాటు నాటు సాంగ్ ను గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ వరించింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ కేటగిరిలో ఈ సాంగ్ అవార్డు ను సొంతం చేసుకుంది. ఈ అవార్డును ఆర్.ఆర్.ఆర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి అందుకున్నారు. ఈ అవార్డుతో ఆస్కార్ రేసులో నాటు నాటు సాంగ్ కీలకమైన అడుగువేసింది.
For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News