Sailesh Kolanu:వెంకీ కి జోడిగా “కేజీఎఫ్” ముద్దుగుమ్మ!

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ సూపర్ స్టార్ యష్ హీరోగా.. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం కేజిఎఫ్. ఈ చిత్రం ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిత్రంలోని నటీనటులకు పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు లభించింది. ముఖ్యంగా శ్రీనిధి నటన ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇప్పటికే కోలీవుడ్ లో కోబ్రా సినిమాతో అడుగుపెట్టింది శ్రీనిధి. కానీ ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఫలితాన్ని రాబట్టకపోవడంతో శ్రీనిధి కెరీర్ అయోమయంలో పడింది.

కానీ ఇప్పుడు అద్భుతమైన అవకాశం ఆమెను వెతుక్కుంటూ వచ్చింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తెలుగు తెరకి పరిచయం కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తుంది. ఇటీవల f3 చిత్రంతో సందడి చేసిన విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం రానాతో కలిసి ‘రానా నాయుడు’ అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే.

అలాగే హిట్ 1, హిట్ 2 చిత్రాలతో పేరు తెచ్చుకున్న శైలేష్ కొలను దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ ఓ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. కమల్ హాసన్ విక్రమ్ తరహాలో యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారట.ఇది వెంకటేష్ 75వ చిత్రం . త్వరలోనే ఈ మూవీ షూటింగ్ కూడా ప్రారంభం కానుందట. అయితే ఈ చిత్రంలో వెంకటేష్ సరసన హీరోయిన్ గా శ్రీనిధి శెట్టిని ఎంపిక చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
త్వరలోనే అఫీషియల్ గా ప్రకటించబోతున్నారని సమాచారం. నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ చిత్రం రూపొందనుందని.. త్వరలోనే మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏదైతేనేం కే.జి.ఎఫ్ భామ లక్కీ ఛాన్స్ కొట్టేసిందని అప్పుడే అంటున్నారు విన్నవాళ్లంతా.

- Advertisement -

 

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు