Pushpa : సర్వం సిద్ధం

అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అతను సినిమా తీస్తే  మినిమం గ్యారెంటీ అని ప్రేక్షకులకు నమ్మకం ఉంటుంది.  అల్లు అర్జున నటన చాలా అద్భుతమనే చెప్పాలి. ఒక్కో సినిమాలో ఒక్కో క్యారెక్టర్ తో ప్రేక్షకులను మెప్పించడానికి చాలా కష్టపడుతుంటారు. అల్లు అర్జున్ డ్యాన్స్ ప్రత్యేకమనే చెప్పాలి. ప్రతి సినిమాకు ఒక కొత్తదనంతో ప్రేక్షకులను మైమరిపిస్తాడు. 

ఇక ఇటీవల వచ్చిన పుష్ప సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సినిమా దేశ వ్యాప్తంగా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమాతో అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ గా మారిపోయాడు. గత ఏడాది డిసెంబర్ లో పుష్ప ది రైజ్ పేరుతో విడుదలై  రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమాకి కొనసాగింపుగా ది పుష్ప రూల్ పై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. తాజాగా పుష్ప చిత్రం అభిమానులకు ఒక అప్డేట్ ని అందించింది. 

ఈ సినిమా కోసం పోస్టర్ డిజైన్ కోసం హీరో, హీరోయిన్స్ పై ఫోటో షూట్స్ కొనసాగుతుందని, సెలబ్రిటీ ఫోటో గ్రాఫర్ అవినాష్ గోవరికర్ ఆధ్వర్యంలో అందరం ఎంతో కష్టపడుతూ ఆడియన్స్ కి మంచి అవుట్ ఫుట్ అందించేందుకు పోస్టర్స్ ని సిద్ధం చేస్తున్నట్టు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఇప్పటికే అల్లు అర్జున్ ఫోటో షూట్ పూర్తవ్వగా, త్వరలో రష్మిక ఫోటో షూట్ కూడా పూర్తి చేయనున్నట్టు తెలిపింది.  ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు