Samantha : రిలీజ్ డేట్ వచ్చేసింది

టాలీవుడ్ అగ్ర హీరోయిన్లలో సమంత ఒకరు. నాగచైతన్యతో విడాకులు ప్రకటించిన తరువాత వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే సమంత విడాకుల తరువాత సోషల్ మీడియాలో స్పందించడమే బంద్ చేసింది. తాజాగా  రెండు, మూడు పోస్టులు మినహా ఆమె సోషల్ మీడియాకి దూరంగానే ఉంటుంది.  

ప్రస్తుతం సమంత చేతిలో యశోద, శాకుంతలం సినిమాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ మధ్య సమంత లేడీ ఓరియెంటేడ్ పాత్రల్లో నటిస్తుంది. సమంత నుంచి రాబోతున్న క్రేజీ ప్రాజెక్టులలో యశోద ఒకటి. ఈ చిత్రం ఇప్పటికే విడుదలవ్వాల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఇందులో తెలుగు, తమిళం రెండింటిలో సమంతనే డబ్బింగ్ చెప్పడం విశేషం.

తాజాగా యశోద సినిమా రిలీజ్ డేట్ ని రివీల్ చేశారు. దీని కోసం ప్రేక్షకులకు ఒక ఫజిల్ ఇచ్చారు. ట్విట్టర్ లో నిర్మాణ సంస్థ శ్రీదేవి మూవీస్ ఒక లింక్ ఇచ్చి ఈ టాస్క్ ని పూర్తి చేస్తే సినిమా డేట్ వస్తుందని కండిషన్ పెట్టింది. ప్రేక్షకులు ఇది రివీల్ అవుతుంటే ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. విడుదల తేదీ ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూశారు.

- Advertisement -

ఎట్టకేలకు అది నవంబర్ 11న విడుదలవుతుందని ప్రకటించారు. అది విడుదలైన కొద్ది సేపటికి శ్రీదేవి మూవీస్ మరో పోస్టర్ ని విడుదల చేసింది.  ఆ పోస్టర్ లో సమంత ఏడుస్తూ కనిపించింది. అదేవిధంగా మురళి శర్మ, సంపత్ రాజు, వరలక్ష్మీ శరత్ కుమార్ కనిపించారు. మొత్తానికి యశోద ఎప్పుడు విడుదలవుతుందని ఎదురు చూసిన ప్రేక్షకులకు మేకర్స్ మంచి ట్రీట్ ఇచ్చారు. 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు