Bigg Boss Season 6 : ముహూర్తం ఖరారు

టీవీలో ఎక్కువ ప్రేక్షాదరణ ఉన్న షోలో బిగ్ బాస్ ఒక్కటి. హాలీవుడ్ లో స్టార్ట్ అయిన ఈ రియాల్టీ షో.. బాలీవుడ్, టాలీవుడ్ తో పాటు అన్ని ఇండస్ట్రీలకు వచ్చింది. టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఐదు సీజన్లను, ఒక ఓటీటీ సీజన్ ను బిగ్ బాస్ పూర్తి చేసుకుంది. తాజాగా ఆరో సీజన్ కు సర్వం సిద్ధమైంది. ఇప్పటి వరకు మూడు సీజన్లకు హోస్ట్ గా ఉన్న నాగార్జున ఈ సీజన్ కు కూడా హోస్ట్ గానే ఉన్నారు. ఆరో సీజన్ కు ఇప్పటికే నిర్వాహకులు సర్వం సిద్దం చేశారు. దీనికి సంబంధించిన ఒక ప్రోమోను నిర్వాహకులు ఇటీవలే వదిలారు.

తాజాగా మరో ప్రోమోను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఈ ప్రోమోలో బిగ్ బిస్ ఆరో సీజన్ కు ముహూర్తం ఖరారు చేశారు. ఎప్పటి నుండి ప్రసారం అవుతుందో డేట్ ను కూడా ప్రకటించారు. ఈ ప్రోమో లో కొంతమంది యువకులు గల్లి క్రికెట్ ఆడుతుంటారు. బెల్ మోగిన వెంటనే బౌలర్ బంతి తీసుకునే అలాగే ఇంట్లోకి పరిగెత్తుతాడు. అక్కడ ఉన్న మిగితా యువకులు కూడా క్షణాల్లో మాయమైపోతారు. ఒక బ్యాట్స్ మెన్ మాత్రమే అక్కడ ఉంటాడు.

ఆ సందర్భంలో కింగ్ నాగర్జున ”అట్టా ఎర్రి మొహమేసుకుని సూత్తావేంట్రా.. ఇక్కడ ఆట ఆగిందంటే అక్కడ అసలైన ఆట మొదలైనట్లేగా.. లైఫ్ లో ఏ మూమెంట్ అయినా బిగ్ బాస్ తర్వాతే” అంటూ చెబుతారు. అప్పడే బిగ్ బాస్ సీజన్ 6 ప్రసారం అయ్యే డేట్ సెప్టెంబర్ 4 అని ప్రకటిస్తారు. కాగ సెప్టెంబర్ 4 నుండి ప్రారంభమయ్యే బిగ్ బాస్ కోసం అభిమానులు చాలా రోజుల నుండి ఎదురుచూస్తున్నారు.

- Advertisement -

https://youtu.be/__NSQK6Ko9w

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు