Puri Jagannath: మీరు మారిపోయారు సర్..

మాములుగా హీరోలకి అభిమానులు ఉండటం సహజం, కానీ దర్శకులకు అభిమానులు ఉండటం కొంచెం ఆసక్తికరమైన విషయం. దర్శకులు తీసే సినిమాలు బట్టి, ఆ సినిమాలలోని పాత్రలను బట్టి ఆయా దర్శకులకు అభిమానులు ఏర్పడతారని నిరూపించాడు పూరి జగన్నాథ్.
రామ్ గోపాల్ వర్మ దగ్గర శిష్యరికం చేసిన పూరి, అతి తక్కువ కాలంలోనే స్టార్ డైరెక్టర్ గా స్టార్ మేకర్ గా మంచి పేరును సాధించాడు. కేవలం తన సినిమాల్లో హీరో కేరెక్టరైజేషన్ తోనే ప్రేక్షకుల మనస్సులో గుర్తుండే స్థాయిని సంపాదించాడు.

బద్రి సినిమాతో మొదలైన పూరి జగన్నాథ్ ప్రయాణం హిట్ , ప్లాప్స్ తో సంబంధం లేకుండా సాగుతూనే ఉంది. పూరి కెరియర్ లో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు ఉన్నాయ్, మర్చిపోలేని కూడా డిజాస్టర్ లు ఉన్నాయ్. అలానే పూరి వ్యక్తిగత జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా, పూరి సినిమా కెరియర్ లో మాత్రం బ్రేక్స్ లేవు అని చెప్పొచ్చు.వారం రోజుల్లో కథను రాసేసి, మరో వారం రోజుల్లో డైలాగ్స్ రాసేసి అరవై, డెబ్భై రోజుల్లో సినిమాను పూర్తిచేయడం పూరి స్టైల్. ఈ స్పీడ్ ను మేకింగ్ స్టైల్ ను దాసరి నారాయణరావు, రాఘవేంద్ర రావు, రవిరాజా పినిశెట్టి లాంటి పెద్ద పెద్ద దర్శకులు మెచ్చుకున్నారు. పాన్ ఇండియా సినిమాలు రాసే విజయేంద్ర ప్రసాద్ కూడా ఇప్పటికి పూరి జగన్నాథ్ ను ఆకాశానికి ఎత్తేస్తుంటారు.

కానీ ఈ మధ్యకాలంలో పూరి ఒక సినిమా కోసం ఎక్కువ రోజులు కేటాయించిన సమయం ఏదైనా ఉంది అంటే అది లైగర్ సినిమా కోసమే. గత రెండేళ్లుగా పూరి లైగర్ సినిమా పనుల్లో ఉన్నారు. ఎట్టకేలకు ఈ చిత్రం ఆగష్టు 25న విడుదలకానుంది. ఇందులో భాగంగా చిత్ర యూనిట్ ప్రొమోషన్స్ లో స్పీడ్ పెంచింది. రీసెంట్ గా ఛార్మి తో జరిగిన ఇంటర్వ్యూ లో పూరి మాట్లాడుతూ “ఇప్పటివరకు చాలా స్పీడ్ గా సినిమాలు చేశాను, అన్ని ఎక్స్పరిమెంటల్ ఫిలిమ్స్ చేసేసాను, ఇకపై అలా కాకుండా స్పీడ్ తగ్గించి మంచి సినిమాలు మాత్రమే కొంచెం టైం తీసుకుని చేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు పూరి. వ్యక్తిగతంగా ఈ నిర్ణయం పూరికి ఎలా అనిపినించినా, పూరి జగన్నాథ్ ను ఇష్టపడేవాళ్ళకి మాత్రం కొంచెం మింగుడు పడని విషయం. అలానే ఇండ్రస్ట్రీ కి కూడా ఇది కొంత నష్టమే కలిగిస్తుంది. త్వరగా సినిమాలు మొదలై రిలీజ్ అయితే నిర్మాతలు, డిస్ట్బ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్ లాభాల బాటలో పడతారు. లేదంటే సినిమాల కోసం కళ్ళు కాయలు కాచేలా వెయిట్ చేసే రోజులు వస్తాయి. వాస్తవంగా పూరి జగన్నాథ్ లాంటి దర్శకులను ప్రేరణ గా తీసుకునే కొంతమంది దర్శకులు తమ స్పీడ్ ను పెంచుకుంటున్నారు.ఇటువంటి తరుణంలో పూరి స్లోగా సినిమాలు చేస్తాననే నిర్ణయం సరికాదని చాలామంది సినీ ప్రముఖుల అభిప్రాయం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు