Bigboss season7: సందీప్ కాకుండా శివాజీ పవర్ అస్త్ర ని ఎందుకు బ్రేక్ చేసారు?

Bigboss season7:

తెలుగు టెలివిజన్ లో బిగ్ బాస్ సీజన్ 7 రోజుకో మలుపు తీసుకుంటుంది. ఈ సీజన్లో అంతా ఉల్టా పల్టా గా సాగుతుందని నాగార్జున చెప్పినట్టుగానే, గేమ్ లో చాలా మార్పులు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఆటలో కూడా ఆడియన్స్ ఎక్స్ పెక్ట్ చేసిన వారు కాకుండా వేరే వాళ్ళు కంఫర్మ్ హౌస్ మేట్స్ కావడం షాకింగ్ గా అనిపిస్తుంది. ముందుగా శోభా శెట్టి కాగా, ఈసారి ప్రశాంత్ అయ్యాడు. అయితే ఆడియన్స్ మాత్రం అమర్ దీప్, యావర్ లో ఒకరు గెలుస్తారనుకున్నారు.

ఇక అసలు విషయానికొస్తే బిగ్ బాస్ లో గత కొన్ని రోజులుగా సంచాలక్ గా వ్యవహరిస్తున్న శివాజీ, సందీవ్ పై అసంతృప్తిగా ఉన్నారన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సందీప్ ఈ వారం లో యావర్, అమర్ దీప్, గౌతమ్ ఇంకా కొందరు కంటెస్టెంట్స్ పట్ల జడ్జిమెంట్ సరిగా లేదని, కంటెస్టెంట్స్ నాగార్జున తో ఒక రూమ్ లో చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టు నాగార్జున శివాజి, సందీప్ లలో ఎక్కువ మంది నామినేట్ చేసిన శివాజి నుండి పవర్ అస్త్ర ని తీసుకుని బ్రేక్ చేసి, తనని నార్మల్ కంటెస్టెంట్ గా చేయడం జరిగింది.

అయితే ఆడియన్స్ మాత్రం ఇది కరెక్ట్ కాదని సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. సందీప్ ఎక్కువ సార్లు సంచాలక్ గా ఫెయిల్ అవగా, శివాజీ స్మైలింగ్ టాస్క్ లో మాత్రమే ఫెయిల్ అయ్యాడు. పైగా చాలా సార్లు శివాజీ కంటెస్టెంట్స్ ని ఆటలో ఎంకరేజ్ చేస్తాడు. దాన్ని బట్టి ఆడియన్స్ శివాజీ పవర్ అస్త్ర ని తీసుకోవడం పట్ల అసంతృప్తి గా ఉన్నారని తెలుస్తుంది.

- Advertisement -

అయితే నాగార్జున డెసిషన్ మాత్రం చాలా మంది ఆడియన్స్ కి అర్ధం కాలేదు. అక్కడ ఎక్కువ మంది కంటెస్టెంట్స్ శివాజీ ని నామినేట్ చేసారు కాబట్టి శివాజీ పవర్ అస్త్ర ని తీసుకున్నారు, ఇది ఒక రీసన్ అయితే, మరో సైడ్ నుండి నాగార్జున చెప్పిన ప్రకారం స్మైలింగ్ టాస్క్ లో హ్యుమానిటీ గా కూడా ఆలోచించకుండా, నెగ్లెట్ చేసి ఫెయిల్ అయ్యాడు, గౌతమ్ మెడకి తేజ బెల్ట్ వేసి సడన్ గా లాగడం, ఇలా ఒక్కసారి కాదు ఆరు సార్లు చేసినప్పటికి శివాజీ అక్కడ రియాక్ట్ కాకపోవడం వల్ల శివాజి నుండి పవర్ అస్త్ర తీసుకున్నారని తెలుస్తుంది.

ఎందుకంటే హౌస్ మేట్స్ లో సీనియర్ అయిన శివాజీపై అందరి కంటే ఎక్కువ రెస్పాన్స్బిలిటీ ఉంటుంది. కానీ అక్కడే శివాజీ ఫెయిల్ అయ్యాడు. ఏది ఏమైనా శివాజీ ఇక మీద నుండి హౌస్ మేట్ గా కాకుండా మళ్ళీ కంటెస్టెంట్ గా మారడం జరిగిపోయింది.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the

Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు