Women’s Day 2024 : ఉమెన్స్… ది ఇన్స్పిరేషనల్ జర్నీ

అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా మహిళలు కూడా అభివృద్ధి సాధించాలని కోరుకుంటూ ప్రతి ఏడాది మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సెలబ్రేట్ చేసుకుంటున్నాం మనం. అయితే ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో పలువురు హీరోయిన్లు సక్సెస్ అయ్యి ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా నిలిచారు. ఉమెన్స్ డే సందర్భంగా ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న టాప్ త్రీ హీరోయిన్ల లైఫ్ జర్నీపై ఒక లుక్కేద్దాం.

1. సమంత 
14 ఏళ్ల క్రితం సినీ ఇండస్ట్రీకి పరిచయమైన సమంత మొదటి మూవీతోనే మాయ చేసిన విషయం తెలిసిందే. చిన్నతనంలో చదువులో ముందున్న ఈ బ్యూటీ ఎవరి మీద ఆధారపడకూడదు అని అప్పుడే నిర్ణయించుకొని పాకెట్ మనీ కోసం పార్ట్ టైం జాబ్స్ కూడా చేసేదట. ఆ తర్వాత మోడలింగ్ లోకి ప్రవేశించి హీరోయిన్ గా ఎదిగింది. మొదటి సినిమా ఏం మాయ చేసావే మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. అయితే ఎవరి సపోర్ట్ లేకుండానే ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత సౌత్ లోనే స్టార్ హీరోయిన్ గా తిరుగులేని స్థాయికి వెళ్ళింది. ముఖ్యంగా టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయ్యింది. ఎన్నో కమర్షియల్ సినిమాల్లో, ఎక్స్పరిమెంటల్ మూవీస్, లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో కూడా నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. ఫ్యామిలీ మెన్ లాంటి వెబ్ సిరీస్ లో కనిపించే సాహసం చేసి దేశమంతా తన గురించి మాట్లాడుకునేలా చేసింది. ఇక ఇష్టపడ్డవాడినే పెళ్ళాడి అక్కినేని వారి ఇంటికి కోడలుగా అడుగు పెట్టింది. కానీ పర్సనల్ ఇష్యూస్ వల్ల భర్తతో విడిపోయి బాధనీ, విమర్శలను ఎదుర్కొంది. అదే సమయంలో అనారోగ్యంతో కూడా ఫైట్ చేయాల్సి వచ్చింది సమంత. అయినప్పటికీ వెనకడుగు వెయ్యకుండా ఆత్మవిశ్వాసంతో తనకున్న మయోసైటిస్ జబ్బుతో పోరాడి గెలిచింది. మళ్లీ సినిమాలపై కాన్సన్ట్రేషన్ చేసింది.

2. నయనతార
సినిమా ఇండస్ట్రీలో సుదీర్ఘ ప్రయాణం చేసి ఒక బెంజ్ మార్క్ ను క్రియేట్ చేసిన హీరోయిన్ల లిస్టులో నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ బ్యూటీ 20 ఏళ్లకు పైగానే ఇండస్ట్రీలో కంటిన్యూ అవుతోంది. లేడీ సూపర్ స్టార్ అని ఆమెకున్న ట్యాగ్ చూస్తేనే నయన్ ఎంత పవర్ ఫుల్ అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఆమె వెండితెరపై ఎలాంటి పాత్రలోనైనా నటించగలదు. సీనియర్ హీరోలు, యంగ్ హీరోలు అని తేడా లేకుండా తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేసి అభిమానులను మెప్పించడమే ఆమె పని. 2003లో మలయాళ మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నయనతార ఇంగ్లీష్ లిటరేచర్ లో డిగ్రీ పూర్తి చేసింది. అయితే ఆమె చదువుకుంటున్న సమయంలోనే మోడలింగ్ వైపు అడుగులు వేసి, టీవీ యాంకర్ గా కూడా పనిచేశారు. ఆ తర్వాత హీరోయిన్ గా మారి లైఫ్ లో ఎన్నో ఎత్తు పల్లాలను తట్టుకొని నిలబడింది. ఆమె సినిమాలు, నటన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇక పర్సనల్ లైఫ్ లో శింబు, ప్రభుదేవా వంటి స్టార్స్ తో ప్రేమాయణం నడిపించి బ్రేకప్ తో ఫుల్ స్టాప్ పెట్టింది. రెండుసార్లు ప్రేమలో విఫలం అయినప్పటికీ ఆ గాయాలను తట్టుకుని నిలబడి మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్ రేంజ్ కి చేరుకుంది. ఇక నయనతార కెరీర్ కు ఫుల్ స్టాప్ పడినట్టే అని భావించిన టైంలోనే అలలా ఎగిసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ సినిమాలతో పాటు భర్త విగ్నేష్ శివన్, ఇద్దరు పిల్లలతో పర్సనల్ లైఫ్ లో కూడా సంతోషంగా ఉంది.

- Advertisement -

3. దీపిక పదుకొనే
ప్రస్తుతం బాలీవుడ్ ను ఏలేస్తున్న దీపిక తొమ్మిదేళ్ల వయసులోనే మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. 2007లో రిలీజ్ అయిన ఓం శాంతి ఓం మూవీతో బాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇక అప్పటి నుంచి ఇప్పటి దాకా దాదాపు రెండు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్ లో ఎన్నో హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. ఈ బ్యూటీ కూడా పర్సనల్ లైఫ్ లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది. అనారోగ్యం, లవ్ లైఫ్ లోని బాధలు అన్నింటినీ భరించి, వాటి నుంచి బయటపడి ఇప్పుడు తన భర్త రన్వీర్ సింగ్ తో సంతోషంగా ఉంటోంది. అలాగే ప్రస్తుతం దీపికా “కల్కి” వంటి పాన్ వరల్డ్ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే అంతకంటే ముందే ఈ బ్యూటీ హాలీవుడ్ మూవీలో కూడా హీరోయిన్ గా మెరిసింది. కెరీర్ మంచి ఫామ్ లో ఉన్న సమయంలోనే ఈ అమ్మడు మానసిక కుంగుబాటుకు గురైంది. డిప్రెషన్ సమస్యతో ఏకంగా ఆత్మహత్య చేసుకోవాలనుకుందట. కానీ తన తల్లి ఇచ్చిన ధైర్యం సపోర్ట్ తో ఆందోళన, ఒత్తిడి వంటి సమస్యలను ఎదుర్కొని నిలబడింది. సక్సెస్ ఫుల్ ఉమెన్ గా ఇప్పుడు కెరియర్ ను లీడ్ చేస్తోంది.

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు