Personality Development : ఈ లక్షణాలు ఉంటే మీరు పక్కా ఇంటెలిజెంట్… కానీ కాన్ఫిడెన్స్ లేదంతే

మీరు తెలివైనవారేనా? ఎప్పుడైనా మిమ్మల్ని మీరు ఈ ప్రశ్న వేసుకున్నారా? కొంతమంది సైకాలజీ నిపుణుల ప్రకారం ఒక వ్యక్తి ఎంత ఇంటిలిజెంట్ లేదా టాలెంటెడ్ అయితే అంత ఇన్ సెక్యూరిటీతో ఉంటారట. దీని కారణంగానే తాము ఎంత ఇంటలిజెంట్ అన్న విషయాన్ని కూడా వాళ్ళు గ్రహించలేరట. ఇప్పుడు మనం చెప్పుకోబోయే కొన్ని లక్షణాలు కనిపిస్తే మీరు పక్కా ఇంటిలిజెంట్ అని అర్థం. కాకపోతే కాన్ఫిడెన్స్ లెవెల్ కాస్త తక్కువగా ఉండి ఉండొచ్చు అంతే.

1. ఫెయిల్యూర్ కు భయపడడం
చాలామంది తెలివైన వ్యక్తులు ఫెయిల్ అవుతామో అని భయపడతారట. ఎందుకంటే వాళ్ళు తాము చేస్తున్న పనిని పర్ఫెక్ట్ గా చేయాలనుకుంటారట. అలాంటప్పుడు ఫెయిల్ అవుతాం ఏమో అనే ఆలోచనను కూడా వాళ్ళు తీసుకోలేరట. ఇతరులు కూడా వాళ్లను ఎక్కువగా అంచనా వేయడం వల్ల తాము చేస్తున్న పనిలో ఫెయిల్ అవుతాం ఏమోనని ఇన్ సెక్యూరిటీ పెరుగుతుందట. దీంతో చిన్న చిన్న విషయాలకు టెన్షన్ పడడం, తమ బలాలకు బదులుగా ఇతర వ్యక్తులని సంతోష పెట్టడానికి ప్రయత్నించడం, రిస్క్ తీసుకోవడానికి లేదా కొత్త మార్గాల్లో పనుల్ని చేయడానికి భయపడడం వంటివి చేస్తారట.

2. కాంప్లిమెంట్స్ ను తీసుకోలేకపోవడం
తెలివైన వాళ్లు కాంప్లిమెంట్స్ ను ఎప్పుడూ యాక్సెప్ట్ చేయరట. కొంతమంది ఏదో మర్యాదపూర్వకంగా పొగడ్తలకు థాంక్స్ చెప్పినప్పటికీ లోలోపల అసౌకర్యంగా భావిస్తారట.

- Advertisement -

3. మాస్క్ వేసుకోవడం
ఇంటలిజెంట్ పీపుల్ కొంతమంది తమతో తామే మాట్లాడుకుంటారట. అలాగే కొన్ని విషయాల గురించి అతిగా ఎగ్జైట్ అవ్వడం, మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడటం వంటివి జరుగుతాయట. అలాంటి వాటివల్ల జనాల్లో ఉన్నప్పుడు ఇబ్బంది పడకుండా ఉండడానికి మాస్క్ వేసుకుంటారట. అంటే తమ నిజ స్వరూపాన్ని బయట పెట్టకుండా జాగ్రత్తగా ఉంటారట. ఎందుకంటే ప్రజలు తమను జడ్జ్ చేస్తారని, ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారని భావిస్తారట.

4. మీ మీద మీకే అనుమానం రావడం
తెలివిగల వాళ్లు వాళ్ల టాలెంట్, సక్సెస్ వంటి వాటిని వాళ్లే అనుమానిస్తారట. ఏదైనా సాధించినప్పుడు ఎవరైనా కాంప్లిమెంట్ ఇస్తే తమను తాను తగ్గించుకునే విధంగా మాట్లాడతారట. అదేమంత ఇంప్రెస్సివ్ కాదు, ఎవరైనా ఆ పనిని చేయగలరు, నేను లక్కీ లాంటి ఆన్సర్ ఇస్తారట.

5. వీటితోపాటు ఇంటలిజెంట్ పీపుల్ ఎక్కువగా ఆలోచిస్తారట. ఇన్ సెక్యూరిటీ, టెన్షన్ వంటి కారణాలతో అతిగా ఆలోచిస్తారట. వాళ్లకు దాదాపుగా మానసిక ప్రశాంతత అనేదే ఉండదు అంటున్నారు సైకాలజీ నిపుణులు. ఇంకా ప్రతి విషయంలోనూ సెకండ్ గెస్, ఇతరుల ఒపీనియన్ ను గౌరవించడం, టూ మచ్ అటెన్షన్ వద్దనుకోవడం, మిమ్మల్ని మీరే తీవ్రంగా విమర్శించుకోవడం, మాట్లాడడానికి వెనకాడడం వంటి లక్షణాలు కనిపించాయి అంటే మీరు పర్ఫెక్ట్ ఇంటెలిజెంట్ అని అర్థం. అయితే కాన్ఫిడెన్స్ లెవెల్ ను మాత్రం కాస్త పెంచుకోవాల్సి ఉంటుంది.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు