Family Star Relese Date : అఫిషియల్… “ఫ్యామిలీ స్టార్” రిలీజ్ డేట్ ఫిక్స్

రీసెంట్ గా జరిగిన ప్రెస్ మీట్ లో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఏప్రిల్ 5న “దేవర” మూవీ రిలీజ్ కాకపోతే, “ఫ్యామిలీ స్టార్” వస్తాడు అని ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో “దేవర” మూవీ పోస్ట్ పోన్ కన్ఫామా? అనే డౌట్ వచ్చింది అందరికీ. ఆ డౌట్ ను క్లారిఫై చేస్తూ తాజాగా “ఫ్యామిలీ స్టార్” రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు మేకర్స్.

రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ “ఫ్యామిలీ స్టార్”. “గీత గోవిందం” సినిమాతో విజయ్ దేవరకొండకు మొదటి 100 కోట్ల సినిమాను ఇచ్చిన డైరెక్టర్ పరశురాం దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతోంది. వీళ్ళిద్దరి కాంబినేషన్లో రాబోతున్న రెండవ చిత్రం కావడంతో “ఫ్యామిలీ స్టార్” మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన మృణాల్ ఠాకూర్, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న 54వ సినిమా, విజయ్ దేవరకొండ కెరీర్లో రూపొందుతున్న 13వ సినిమా “ఫ్యామిలీ స్టార్”. తాజాగా సోషల్ మీడియా వేదికగా చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ “ఫ్యామిలీ స్టార్” ఏప్రిల్ 5న రిలీజ్ కాబోతుందంటూ అఫీషియల్ గా ప్రకటించింది. నిజానికి ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలనుకున్నారు మేకర్స్. కానీ అప్పటికే నాలుగైదు సినిమాలు రిలీజ్ అవుతుండడంతో వాయిదా పడింది. ఇక ఇప్పుడు ఏప్రిల్ 5న రిలీజ్ కావడం వల్ల నాలుగైదు రోజులు కలిసి రాబోతున్నాయి. ఏప్రిల్ 5న శుక్రవారం, 6, 7 తేదీలు వీకెండ్, ఏప్రిల్ 8న తెలుగువారి నూతన సంవత్సరం ఉగాది ఉండడంతో వరుసగా నాలుగు రోజులు కలిసి రాబోతున్నాయి.

- Advertisement -

ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న “దేవర” మూవీని ముందుగా ఏప్రిల్ 5న రిలీజ్ చేయబోతున్నట్టుగా ప్రకటించారు. కానీ తాజాగా “ఫ్యామిలీ స్టార్” అనౌన్స్మెంట్ చూస్తే ఈ మూవీ పోస్ట్ పోన్ అయింది అన్న విషయం కన్ఫామ్ అవుతుంది. మూవీకి సంబంధించిన పాటలు, షూటింగ్ లేట్ అవ్వడం, ఏపీ అసెంబ్లీ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని “దేవర”ని వాయిదా వేశారు. అయితే ఈ మూవీ పోస్ట్ పోన్ అయ్యిందన్న విషయాన్ని మేకర్స్ ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. కానీ “ఫ్యామిలీ స్టార్” రిలీజ్ డేట్ పై ఇప్పుడు అఫీషియల్ అనౌన్స్మెంట్ రావడంతో “దేవర” పోస్ట్ పోన్ ఖాయమైంది.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు