Pushpa 2 : రిస్క్ చేయలేం… చేతులెత్తేస్తున్న బయ్యర్లు

Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప” మూవీకి మరో కష్టం వచ్చి పడింది. ఇప్పటికే ఈ సినిమాలో నటిస్తున్న సపోర్టింగ్ యాక్టర్ జగదీష్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ మూవీ బిజినెస్ విషయంలో రిస్క్ చేయలేం అంటూ చేతులెత్తేస్తున్నారు బయ్యర్లు. మరి భారీ అంచనాలు ఉన్న ఈ పాన్ ఇండియా మూవీకి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అనే వివరాల్లోకి వెళితే…

లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్ రూపొందిన పాన్ ఇండియా మూవీ “పుష్ప” బ్లాక్ బస్టర్ హిట్ అన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఈ మూవీకి సీక్వెల్ గా “పుష్ప 2” రాబోతోంది. ఈ మూవీ ఇప్పుడు షూటింగ్ దశలో ఉంది. ఆగస్టులో రిలీజ్ చేయబోతున్నామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే “పుష్ప 2” థియేట్రికల్ బిజినెస్ గురించి ఓ వార్త బయటకు వచ్చింది. ఈ మూవీ రైట్స్ ను భారీ ధరకు కొనుగోలు చేయడానికి బయ్యర్స్ భయపడుతున్నారట. ముఖ్యంగా యూఎస్ లో “పుష్ప 2” థియేట్రికల్ రైట్స్ కోసం 100 కోట్లను కోట్ చేస్తున్నారట మేకర్స్.

కానీ బయ్యర్లు మాత్రం ఈ సినిమాను 50 కోట్ల కంటే ఎక్కువ రేటుకు కొనుగోలు చేయడం రిస్క్ అని అంటున్నారట. అదేం అని ప్రశ్నిస్తే రీసెంట్ గా రిలీజ్ అయిన “సలార్” మూవీకి ముడిపెట్టి మరీ లెక్కలు చెబుతున్నారట. తెలుగు పాన్ ఇండియా సినిమాలకు ఓవర్సీస్ మార్కెట్ ప్రస్తుతం చాలా బలహీనంగా ఉంది. తాజాగా రిలీజ్ అయిన “సలార్” యూఎస్ బాక్స్ ఆఫీస్ వద్ద 8.2 మిలియన్ల డాలర్లు అంటే అక్షరాల 65 కోట్లు వసూలు చేసి రికార్డును క్రియేట్ చేసింది. ఇంత భారీ కలెక్షన్లు కొల్లగొట్టినప్పటికీ “సలార్” మూవీని ఇంకా అండర్ పర్ఫార్మర్ గానే పరిగణిస్తున్నారట అక్కడి డిస్ట్రిబ్యూటర్లు.

- Advertisement -

ఎందుకంటే ఈ “సలార్” ఇతర భాషల్లో పెద్దగా కలెక్షన్లు రాబట్టలేకపోయింది. “సలార్” హిందీ వర్షన్ కేవలం 1.5 మిలియన్లు మాత్రమే వసూలు. అలాగే కన్నడ, తమిళ, మలయాళం వెర్షన్ లలో “సలార్” కలెక్షన్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి. అదేవిధంగా “పుష్ప” విషయంలో చూసుకుంటే తెలుగులో చెప్పుకోదగ్గ విజయాన్ని సొంతం చేసుకోలేదు గాని, హిందీలో మాత్రం భారీ కలెక్షన్లు కొల్లగొట్టింది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని “పుష్ప 2” థియేట్రికల్ రైట్స్ 50 కోట్లకే కొనుగోలు చేయడానికి రెడీగా ఉన్నామని మొహం మీదే చెప్పేస్తున్నారట యుఎస్ డిస్ట్రిబ్యూటర్లు. కానీ “పుష్ప” మేకర్స్ మాత్రం బెస్ట్ డీల్ కోసం ప్రయత్నిస్తున్నారని సమాచారం. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు ఏకంగా 200 కోట్ల రూపాయల బిజినెస్ ని ఆశిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. మరి “పుష్ప 2” ఫైనల్ బిజినెస్ ఎలా ఉండబోతుందో చూడాలి.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు