Tollywood: సీక్వెల్ పిచ్చితో సినిమాలను చంపేస్తున్న డైరెక్టర్స్

Tollywood : “బాహుబలి” మూవీ తో రాజమౌళి క్రియేట్ చేసిన సీక్వెల్ ట్రెండ్ ఇప్పటికీ కొనసాగుతోంది. అయితే అప్పట్లో బాగానే ఉంది కానీ రాను రానూ ఈ సీక్వెల్ పిచ్చి చిన్న సినిమాలకు కూడా పట్టుకుంది. ప్రస్తుతం చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని సినిమాలకు కూడా సీక్వెల్ ప్రకటిస్తున్నారు మేకర్స్. కానీ దానివల్ల టాలీవుడ్ లో ఇప్పుడు పరిస్థితి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా అయ్యింది. సీక్వెల్ పిచ్చితో డైరెక్టర్ సినిమాలను చంపేస్తున్నారు.

పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ బాహుబలి, కేజిఎఫ్ వంటి సినిమాలకు వచ్చిన ఫలితాలు సినీ పరిశ్రమలో సీక్వెల్ ట్రెండ్ ను క్రియేట్ చేశాయి. ఇక తెలుగు ఇండస్ట్రీ విషయానికి వస్తే ఇప్పుడు చాలా సినిమాలు మొదటి సినిమా సెట్స్ పైకి వెళ్ళకముందే సీక్వెల్ కి ప్లాన్ చేస్తున్నారు. దీంతో పార్ట్ 2 పేరుతో క్యాష్ చేసుకోవడానికి డైరెక్టర్స్ తీసుకునే తప్పుడు నిర్ణయాలు పార్ట్ 1ని చంపేస్తున్నాయి. రీసెంట్ గా “స్కంద” విషయంలో ఇలాగే జరిగింది. క్లైమాక్స్ లో ఎలాంటి లాజిక్ లేకుండా హఠాత్తుగా రెండో రామ్ క్యారెక్టర్ ను పరిచయం చేశారు బోయపాటి. దీంతో పార్ట్ 2 కి మార్గం వేశారు.

ఇక ఈ మూవీ లోనే కాదు ఇదే ఏడాది థియేటర్లలోకి వచ్చి భారీ డిజాస్టర్ గా నిలిచిన “పెదకాపు” మూవీ మరొక ఉదాహరణగా నిలిచింది. శ్రీకాంత్ అడ్డాల ఎలాంటి స్పష్టమైన వివరణ ఇవ్వకుండా ప్రేక్షకులను గందరగోళంలోకి నెట్టేసి సెకండ్ పార్ట్ ని అనౌన్స్ చేశాడు. రీసెంట్ గా వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ “లియో” విషయంలో కూడా ఇలాగే జరిగింది. ఈ మూవీని బలవంతంగా LCUకి కనెక్ట్ చేశాడు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. దీంతో ఈ మూవీపై కూడా విమర్శలు వచ్చాయి. దీంతో “లియో” మూవీలో ఫ్లాష్ బ్యాక్ తప్పు అని, సీక్వెల్లో ఈ మూవీకి సంబంధించిన అసలైన వివరాలు వెల్లడిస్తానని లోకేష్ కవర్ చేసే ప్రయత్నం చేశాడు.

- Advertisement -

ఇక తాజా బ్లాక్ బస్టర్ “సలార్” మూవీలో కూడా మొదటి భాగాన్ని కేవలం రెండవ భాగంపై హైప్ పెంచడానికే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఉపయోగించుకున్నాడు అనే విమర్శలు వచ్చాయి. సీక్వెల్ కోసం ఒకే పార్ట్ గా రావాల్సిన “సలార్”ను సాగదీసారని అన్నారు. దీంతో ఈ ఎఫెక్ట్ బాక్స్ ఆఫీస్ లెక్కల పై బాగానే ప్రభావం చూపించింది. ఇక ఈ ఇయర్ ఎండ్ విడుదలైన కళ్యాణ్ రామ్ “డెవిల్” కూడా రెండు భాగాలుగా రాబోతోంది. కానీ “డెవిల్”కే పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ, ఎవరూ చూడట్లేదు.

మరి సీక్వెల్ ఎలా ఉండబోతోంది? అసలు చూస్తారా? అని ప్రశ్నలు రేకెత్తున్నాయి. ఇప్పటిదాకా రిలీజ్ అయిన సీక్వెల్స్ లో బాహుబలి, కేజిఎఫ్ మాత్రమే బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. దానికి తగ్గట్టుగానే ప్రేక్షకుల్లో అంచనాలను కూడా క్రియేట్ చేశాయి. ఈ క్రమంలోనే చాలామంది పెద్ద డైరెక్టర్ సీక్వెల్ పిచ్చిలో పడి సినిమాను చంపేస్తున్నారు. నిజానికి పార్ట్ 1 అద్భుతంగా ఉంటేనే పార్ట్ 2పై క్రేజ్ ఏర్పడుతుంది. లేదంటే ఎంత ప్రయత్నించినా వేస్ట్ అనే విషయాన్ని డైరెక్టర్లు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు