Fukr3y: బాలీవుడ్ లో మరో 100 కోట్ల సినిమా లోడింగ్..!

Fukr3y:

బాలీవుడ్ ఇండస్ట్రీ లాక్ డౌన్ తర్వాత చాలా డౌన్ అయిన సంగతి తెలిసిందే. ఈ ఇండస్ట్రీ నుండి ఎలాంటి సినిమా వచ్చినా సరే డిజాస్టర్ అయ్యేది, అది చిన్న సినిమానే కాదు స్టార్ హీరో సినిమా అయినా ఆడియన్స్ నిర్దాక్షిణ్యంగా ప్లాప్ చేసేవారు. ఈ తంతు దాదాపుగా మూడేళ్లగా జరిగింది. కానీ బాలీవుడ్ అప్డేట్ అయ్యారో, లేక ఫ్యాన్స్ క్షమించారో తెలియదు గాని, ఈ ఇయర్ లో మాత్రం సినిమాలు ఓ రేంజ్ లో ఆడుతున్నాయి. ముందుగా షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్, జవాన్ చిత్రాలు ఏకంగా వెయ్యి కోట్లకి పైగా కలెక్షన్స్ రాబట్టి ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచాయి.

ఇక ఆ వెంటనే ఎప్పుడో ఫేడ్ అవుట్ అయిన స్టార్ సన్నీ డియోల్ చేసిన గదర్ 2 కూడా బ్లాక్ బస్టర్ అయ్యి ఏకంగా 700కోట్ల వరకు వసూలు చేసింది. దాంతో పాటు అక్షయ్ కుమార్ omg2 , డ్రీం గర్ల్2, సినిమాలు యావరేజ్ టాక్ తెచ్చుకుని కూడా భారీ కలెక్షన్లు కొల్లగొట్టాయి. తాజాగా మరో బాలీవుడ్ సినిమా కూడా థియేటర్లలో రిలీజ్ అయ్యి తెగ హల్చల్ చేస్తుంది. ఆ సినిమాయే “ఫక్రే”3.

బాలీవుడ్ కామెడీ మూవీ ఫక్రే సిరీస్ లో భాగంగా మూడో పార్ట్ గా వచ్చిన ఈ సినిమా బాలీవుడ్ జనాల్ని ఆకట్టుకుంటుంది. నిజానికి ఈ సినిమాలో పెద్దగా కథ లేదు. పైగా చాలా లాజికల్ లెస్ సీన్లు ఉన్నాయి. అయినా సరే బాలీవుడ్ వాళ్ళు ఈ సినిమాని నెత్తిన పెట్టుకుంటున్నారు. సెప్టెంబర్ 28న రిలీజ్ అయిన ఈ సినిమా మూడు రోజుల్లో 30కోట్లు కొల్లగొట్టింది. ఇక ఆదివారం, గాంధీ జయంతి హాలిడేలలో రచ్చ చేసే అవకాశం ఉంది. సినిమా ఎలా ఉన్నపటికీ 100కోట్ల దిశగా సాగిపోతుంది ‘ఫక్రే3’ సినిమా.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు