SandeepReddy Vanga: ఇక్కడ 100 కోట్ల రికార్డు సెట్ చేసే ఆలోచనలో అనిమల్ మేకర్స్?

SandeepReddy Vanga:

టాలీవుడ్ లో బాలీవుడ్ సినిమాల ప్రభావం కాస్త తక్కువే అని తెలిసిందే. ఎదో కంటెంట్ ఉన్న సినిమాలు ఏడాది కి రెండో మూడో తెలుగులో, అదీ సిటీ ఏరియాల్లో ఆడుతాయి. కానీ ఈ ఇయర్ రిలీజ్ అయిన సినిమాల్లో వరుసగా పఠాన్, జవాన్ చిత్రాలు తెలుగులో కూడా డబ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఇవే కాదు లాస్ట్ ఇయర్ వచ్చిన కాశ్మీర్ ఫైల్స్, బ్రహ్మాస్త్ర కూడా తెలుగులో మంచి విజయాల్ని సాధించాయి. ఇది గమనించిన బాలీవుడ్ మేకర్స్ సౌత్ ని, ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ ని అస్సలు మిస్ అవ్వొద్దని గట్టిగా ఫిక్స్ అయినట్టున్నారు.

అందుకే వరుస బాలీవుడ్ సినిమాల్ని తెలుగులో డబ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే టాలీవుడ్ ఆడియన్స్ చూపు మాత్రం ఒక్క సినిమా పై బాగా పడింది. అదే ‘అనిమల్’. రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాని టాలీవుడ్ సెన్సషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహిస్తుండడమే దీనికి కారణం. పైగా ఫస్ట్ లుక్ పోస్టర్ మొదలుకొని రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ కూడా ఓ రేంజ్ లో ఉండి ఆకట్టుకుంది. అందుకే బాలీవుడ్ మేకర్స్ సందీప్ రెడ్డి ఫేమ్ ని వాడుకొని తెలుగులో అనిమల్ ని స్పెషల్ గా రిలీజ్ చేసే ప్లాన్ లో మేకర్స్ ఉన్నారని తెలుస్తుంది.

ఇక తెలుగులో ఇప్పటివరకు రిలీజ్ అయిన సినిమాల్లో జవాన్ ఎక్కువగా 60 కోట్ల వరకు తెలుగురాష్ట్రాల్లో వసూలు చేసింది. ఈ రికార్డు ని బ్రేక్ చేసి ఏకంగా 100కోట్ల రికార్డు సెట్ చేయాలనీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని, ఆ రకంగా హైదరాబాద్ లో మార్కెటింగ్ చేయాలనీ చూస్తున్నట్టు తెలుస్తుంది. అటు ట్రేడ్ విశ్లేషకులు కూడా ఈ మార్క్ సెట్ చేసే ఛాన్స్ అనిమల్ కు ఉందని, ఎందుకంటే సందీప్ రెడ్డి డైరెక్టర్ కావడం వల్ల తెలుగు ఆడియన్స్ కూడా తొందరగా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. పైగా అనిమల్ తెలుగు రైట్స్ దిల్ రాజు చేతిలో ఉండడం వల్ల మార్కెటింగ్ విషయంలో డోకా ఉండదని అనిపిస్తుంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు