Adipurush: డిజాస్టర్ సినిమా.. కానీ అక్కడ బ్రేక్ ఈవెన్ అయ్యింది

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. దానికి ప్రధాన కారణం సినిమాలో ఎన్నో వక్రీకరించిన సీన్లు, డైలాగ్ లు, దానితో పాటు బాలీవుడ్ టెక్నిషియన్ల పైత్యం ఆదిపురుష్ డిజాస్టర్ కావడానికి కారణమయ్యాయి.

అయితే రామాయణం కాన్సెప్ట్ కాబట్టి కొన్ని ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు, కొన్ని వర్గాల ప్రేక్షకులు మొదటి వీకెండ్ బాగా చూసారు. అందువల్ల ఈ సినిమాకి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. అయితే ఆ తర్వాత ఏ రకంగానూ కోలుకోలేకపోయింది ఈ సినిమా. ఇక ఇప్పటివరకు 380కోట్లు మాత్రమే వసూలు చేయగా, మేకర్స్ మాత్రం 460 కోట్లు రాబట్టిందని పోస్టర్స్ వేశారు.

రిలీజ్ అయిన అన్ని చోట్లా డిజాస్టర్ అయిన ఈ సినిమా, ఇండియా లో ఏ ఒక్క ఏరియా లోను బ్రేక్ ఈవెన్ కాలేదు. కానీ ఒక్క ఏరియా లో అయింది. అది కూడా ఇక్కడ కాదు. ఓవర్సీస్ లో..

- Advertisement -

అవును.. ఆదిపురుష్ సినిమా 21కోట్ల ఓవర్సీస్ బిజినెస్ చేయగా, ఫుల్ రన్ లో అక్కడ ఏకంగా 24 కోట్లు రాబట్టి పూర్తి బ్రేక్ ఈవెన్ అయ్యి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇక ఆదిపురుష్ ఒక్క అమెరికాలోనే 2.4 మిలియన్ డాలర్స్ రాబట్టగా, ఓవరాల్ గా 5.9 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఇక బ్రేక్ ఈవెన్ మీద 3కోట్ల లాభాన్ని కూడా రాబట్టింది ఈ సినిమా. అయితే ఆదిపురుష్ రిలీజ్ టైమ్ లోనే పలు హాలీవుడ్ సినిమాలు కూడా రిలీజ్ అవడం వల్ల అక్కడ థియేటర్ల కొరత వచ్చింది. లేకపోతే ఆదిపురుష్ మరిన్ని వసూళ్లు సాధించేదని నెటిజన్లు అంటున్నారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు