Tollywood: మూడు సినిమాలు విభిన్న కోణాలు. ప్రేక్షకుల ఓటు దేనికీ?

టాలీవుడ్ లో ప్రతి వారం కొత్త సినిమాలు రావడం మామూలే. అయితే ఆదిపురుష్ తర్వాత ఇప్పటివరకు మరో పెద్ద సినిమా రాలేదు. అన్ని చిన్న సినిమాలే కావడం విశేషం. మధ్యలో కొన్ని మీడియం రేంజ్ మూవీస్ వచ్చ్చినా కూడా ఆ సినిమాలు ఆడలేదు. గతవారం రిలీజ్ అయిన అన్ని సినిమాలు బోల్తా పడగా, ఈ వారం మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో రెండు డబ్బింగ్ సినిమాలు కాగా, మరొకటి స్ట్రయిట్ సినిమా. అయితే ఈ మూడు సినిమాలు మూడు విభిన్న కోణాల్లో ఉండడం వల్ల అన్ని రకాల ఆడియన్స్ వాళ్ళకి ఇష్టమైన జోనర్ సినిమాకి వెళ్లే ఛాన్స్ ఉంది.

ముందుగా తెలుగు సినిమా “బేబి” గురించి చెప్పుకోవాలి. యూట్యూబ్ స్టార్ వైష్ణవి చైతన్య మెయిన్ లీడ్ గా, ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ లు హీరోలుగా ట్రయాంగిల్ లవ్ స్టోరీ గా వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ఇక ఈ వారం థియేటర్లలో విడుదలవుతున్న స్ట్రెయిట్ తెలుగు సినిమా ఇదొక్కటే.

ఇక టాలీవుడ్ లో రెండు క్రేజీ డబ్బింగ్ సినిమాలు కూడా ఈ వారం రిలీజ్ అయ్యాయి. అందులో ఒకటి మావీరన్. తెలుగులో “మహా వీరుడు” పేరుతో విడుదలవుతున్న ఈ సినిమాలో శివ కార్తికేయన్ హీరోగా నటించాడు. పూర్తిగా కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకి హీరోయే ప్రధాన బలంగా మారనున్నాడు.

- Advertisement -

ఇక చివరగా “మామన్నన్” సినిమా గురించి చెప్పుకోవాలి. తెలుగులో నాయకుడు పేరుతో విడుదల అయ్యింది. ఈ సినిమాలో ఉదయనిధి స్టాలిన్ హీరోగా నటించగా, ప్రముఖ కమెడియన్ వడివేలు ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో సరికొత్తగా నటించాడు. ఇప్పటికే తమిళ్ లో విడుదలై బ్లాక్ బస్టర్ అవగా, ఇప్ప్పుడు తెలుగులోను డబ్ అయ్యి ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అయితే ఈ వారం వస్తున్న సినిమాల్లో పై రెండు సినిమాలకే ఎక్కువ హైప్ ఉన్నా కూడా, ట్రేడ్ విశ్లేషకులు మాత్రం నాయకుడు సినిమాయే మెప్పించే అవకాశం ఉందని అంటున్నారు. ఇక సినిమా ఆల్రెడీ తమిళ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి 70 కోట్ల కలెక్షన్లు దాటేసింది. అయితే ఈరోజు రిలీజ్ అయిన ఈ సినిమాల్లో దేనికి ఇంకా జెన్యూన్ రివ్యూ రాలేదు. మరో రెండు మూడు రోజులు గడిస్తే ఈ సినిమాల అసలు లెక్క తెలుస్తుంది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు