BRO: మళ్ళీ సేమ్ సీన్ రిపీట్ అవుతుందా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన ‘బ్రో’ సినిమా జులై 28న రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. తమిళ హిట్ సినిమా వినోదాయ సీతాం సినిమాకి రీమేక్ గా సముద్రఖని డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా రీమేక్ అయినప్పటికీ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ వల్ల మంచి బజ్ అయితే ఏర్పడింది. ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్, టీజర్ సినిమాపై ఆసక్తి పెంచినప్పటికీ ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ ఆశించిన స్థాయిలో అలరించకపోవటం వల్ల ఫ్యాన్స్ కాస్త నిరాశకు గురయ్యారు. అయితే, గతంలో పవన్ కళ్యాణ్ నుండి వచ్చిన రీమేక్ సినిమాలు భీమ్లా నాయక్, వకీల్ సాబ్ లకు మంచి రెస్పాన్స్ వచ్చినప్పటికీ ఏపీలో పవన్ కళ్యాణ్ కి రాజకీయంగా నెలకొన్న ప్రతికూలత వల్ల బ్రేక్ ఈవెన్ కూడా కాలేకపోయాయి. ఇప్పుడు బ్రో సినిమాకి కూడా అదే సీన్ రిపీట్ అవుతుందా అన్న ఆందోళన ఫ్యాన్స్ లో మొదలైంది.

నిజానికి పవన్ కళ్యాణ్ గత రెండు సినిమాలకు బడ్జెట్ లో సింహభాగం రెమ్యునరేషన్ గా అందుకున్నాడు. సినిమా మేకింగ్ ఖర్చు 20 నుండి 25కోట్ల వరకు అనుకుంటే, పవన్ రెమ్యునరేషన్ 50కోట్లు, ఇతర ఆర్టిస్ట్ ల రెమ్యునరేషన్స్, ప్రమోషన్ ఖర్చులు సుమారు 25కోట్లు వెరసి సినిమా బడ్జెట్ 100కోట్ల వరకు అయ్యింది. ఎంత పవన్ కళ్యాణ్ క్రేజ్ ని నమ్ముకొని నిర్మాతలు అంత బడ్జెట్ పెట్టినా బయ్యర్లు రీమేక్ సినిమాకి అంత రేట్ పెట్టడానికి ముందుకు వచ్చే పరిస్థితి లేదు. భీమ్లా,వకీల్ సాబ్ సినిమాలు బ్రేక్ ఈవెన్ కాలేకపోవటానికి ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్స్ ఇష్యూ, స్పెషల్ షోలకి అనుమతి లేకపోవటం వంటివి ఒక కారణం అయితే, సినిమా స్థాయికి మించిన బడ్జెట్ మరొక కారణం.

బ్రో సినిమా బడ్జెట్ విషయంలో అదే జరిగిందని చెప్పాలి. టీజర్ లో 100కోట్ల బడ్జెట్ కి తగిన విజువల్ క్వాలిటీ కనిపించకపోవడం, థమన్ సంగీతం కూడా క్వాలిటీ విషయంలో గత సినిమాల కంటే తక్కువ స్థాయిలో ఉండటంతో బ్రో సినిమా బ్రేక్ ఈవెన్ చేరుకోవటం కష్టమే అన్న సంకేతాలు ఇస్తున్నాయి. పైగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వం పై చేస్తున్న విమర్శల దాడి కచ్చితంగా బ్రో సినిమాపై ప్రభావం చూపే అవకాశం ఉన్న నేపథ్యంలో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఏ మేరకు నిలదొక్కుకోగలదు అన్నది వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు