Unstoppable with NBK : థీమ్ సాంగ్ కు రంగం సిద్ధం

తెలుగు ఓటీటీ వేదికగా “ఆహా” తీసుకొచ్చిన “అన్ స్టాపబుల్” షో ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ షో ద్వారా తొలిసారిగా హోస్ట్ గా వ్యవహరించారు నటసింహం నందమూరి బాలకృష్ణ. ఎప్పుడూ కోపంగా కనిపించే బాలయ్య హోస్ట్ గా రాణించగలరా అని అందరూ సందేహించారు. కానీ బాలయ్య అన్ స్టాపబుల్ హోస్టింగ్ చూశాక అందరి అభిప్రాయం తప్పని రుజువయింది. వచ్చిన గెస్ట్ లను రిసీవ్ చేసుకోవడం దగ్గర నుంచి.. జోకులు వేస్తూ, హడావిడి చేస్తూ షో నీ చక్కగా ముందుకు నడిపించారు. ఈ షో అశేష ప్రేక్షక ఆదరణ తెచ్చుకుంది.

ఈ షో స్ట్రీమింగ్ అయిన ప్రతి ఎపిసోడ్ కూడా అత్యధిక వ్యూయర్షిప్ సాధించింది. అయితే మొదటి సీజన్ ముగియడంతో అప్పటినుండి అన్ స్టాపబుల్ సీజన్ 2 కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు వస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ షో త్వరలో ప్రారంభం కాబోతోందని నిర్వాహకులు ఇటీవల అధికారికంగా ప్రకటించారు.

ఇక అందరిలో మంచి జోష్ నింపేందుకు ఆహా వారు త్వరలో అన్ స్టాపబుల్ సీజన్ 2 యొక్క యాంథమ్ థీమ్ సాంగ్ ని రిలీజ్ చేయనున్నట్లు కాసేపటికి క్రితం అఫీషియల్ గా ఒక పోస్టర్ ద్వారా ప్రకటించారు. ఇక మరోసారి బాలయ్యతో సరికొత్త కంటెంట్ తో అన్ స్టాపబుల్ షోని ముస్తాబు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ షో ఎప్పుడు మొదలవుతుందా అని ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ త్వరలో రానున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు