Raashii Khanna: ఆ హీరో అంటే క్రష్

2013లో మద్రాస్ కేఫ్ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టిన రాశిఖన్నా మొదటి సినిమాతోనే హీరోయిన్ గా మంచి గుర్తింపుని సంపాదించుకుంది. ఆ తర్వాత అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఊహలు గుసగుసలాడే చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీగా మారింది. కోలీవుడ్, బాలీవుడ్ ఇలా సౌత్ అండ్ నార్త్ లో రాశి కన్నా స్టార్ హీరోయిన్ గా వెలుగుతోంది. బెంగాల్ టైగర్, సుప్రీమ్, జై లవకుశ, తొలిప్రేమ వంటి హిట్ చిత్రాలలో నటించి.. నటనతో పాటు తన గాత్రంతోనూ అలరించింది. జోరు, జవాన్, ప్రతిరోజు పండగే చిత్రాలలో పాటలు కూడా పాడింది రాశిఖన్నా. ఇదిలా ఉంటే.. తన క్రష్ హీరో పేరు రివీల్ చేసింది ఈ అందాల రాశి.

తాజాగా “ఆన్ స్టాపబుల్ విత్ ఎన్బికె సీజన్ 2 ” షో కి గెస్ట్ గా వచ్చిన రాశి ఖన్నాఎపిసోడ్ ప్రోమోని రిలీజ్ చేసింది ఆహా. తనకి రౌడీ హీరో విజయ్ దేవరకొండ పై క్రష్ ఉందని తన మనసులోని మాటను చెప్పేసింది. ఈ ఎపిసోడ్ లో సహజ నటి జయసుధ, మల్టీ టాలెంటెడ్ జయప్రద, మరియు యంగ్ బ్యూటీ రాశి ఖన్నా గెస్టులుగా హాజరయ్యారు. వీరందరితో కలసి బాల కృష్ణ డాన్స్ చేయడం ప్రోమోకి హైలైట్ గా నిలిచాయి. డిసెంబర్ 23 నుంచి ఈ ఎపిసోడ్ ఆహాలో అందుబాటులోకి రానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు