సమంత తల్లి పాత్రలో టబు?

రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న చిత్రం ఖుషి. స్టార్ హీరోయిన్ సమంతవిజయ్ కి జోడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం మోషన్ పోస్టర్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ ను అందుకుంది.

తెలుగుతో పాటు తమిళ, మలయాళం, కన్నడలో రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ కన్ఫర్మ్ చేసారు. అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీ గా ఖుషి సినిమాకు హీషమ్ సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ సినిమా కథ ప్రకారం షూటింగ్ ఎక్కువ భాగం కాశ్మీర్ లో నిర్వహించనున్నారు. అయితే తాజాగా ఈ సినిమా గురంచి కొత్త బజ్ వినిపిస్తుంది. ఒక స్పెషల్ రోల్ గురించి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సెకండ్ హాఫ్ లో వచ్చే ఓ కీలక పాత్రలో బాలీవుడ్ నటి టబు నటించబోతుందట.

అది కూడా సమంత తల్లి పాత్రలో నటించబోతుందనే వార్తలు వెలువడుతున్నాయి. ఇప్పటికే ఆలా వైకుంఠపురం లో సినిమాలో అల్లు అర్జున్ కి తల్లి పాత్రలో నటించిన టబు కి మంచి ఆధరణ లభించింది. సమంత తల్లి పాత్రపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇక విజయ్ దేవరకొండ ఇటీవల లైగర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఆశించినంత సక్సెస్ కాకపోవడంతో ఖుషిపై హోప్స్ పెట్టుకున్నారు . ఇక సమంత ఇటీవల యశోద చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. వీరిద్దరి కాంబోలో రాబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని డిసెంబర్ లోనే విడుదల చేయవలసి ఉండగా ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ మారి వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు