నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న “ఆహా” ఓటీటీ లో ఎక్స్ క్లూజివ్ గా స్ట్రీమింగ్ అవుతున్న “అన్ స్టాపబుల్ సీజన్ 2″ తాజా ఎపిసోడ్ లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో పాటు గోపీచంద్ గెస్ట్ గా వచ్చిన సంగతి తెలిసిందే. రెబల్ స్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ ఎపిసోడ్ గురువారం రాత్రి నుంచే అందుబాటులోకి వచ్చింది. అంచనాలకు తగ్గట్లుగానే ఈ ఎపిసోడ్ భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
ముందుగా వదిలిన ప్రోమోతోనే ఈ ఎపిసోడ్ పై అంచనాలు పీక్స్ కి చేరుకున్నాయి. ఇక ఎపిసోడ్ మొదటి పార్ట్ లో బాలకృష్ణ – ప్రభాస్ మధ్య సాగిన సంభాషణలు అభిమానులను కట్టిపడేసాయి. ఎపిసోడ్ విడుదలైన కొద్ది క్షణాల్లోనే రికార్డ్ స్థాయి వ్యూస్ తో దూసుకెళ్తుంది. అభిమానుల దాటికి ఆహా యాప్ కూడా క్రాష్ అయిపోయింది. ఆహా టీం స్పందించి, ప్రాబ్లంమ్స్ ను సాల్వ్ చేసింది. దీంతో మళ్లీ ప్రభాస్ ఎపిసోడ్ రికార్డ్ స్థాయిలో స్ట్రీమింగ్ అవుతుంది.
Read More: Brahmastra : దీపావళికి వస్తుందా ?
అయితే ఈ షో మొదలుకాగానే బాలకృష్ణ ప్రభాస్ పెళ్లి ప్రస్తావనని తీసుకువచ్చారు. ” ఏంటి.. పెళ్లి ఉందా? లేదా?” అని బాలకృష్ణ ప్రశ్నించగా.. ” ఏమో సార్ ఇంకా తెలియదు ” అని సమాధానం ఇచ్చారు ప్రభాస్. అంటే ఒంటరిగా ఉందామని ఫిక్స్ అయ్యావా అని మళ్ళీ అడిగారు బాలయ్య.. దీనికి ప్రభాస్ సమాధానం ఇస్తూ.. “పెళ్లి చేసుకుంటాను సార్! ఇంకా రాసిపెట్టి లేదేమో ” అని చెప్పుకొచ్చారు. దీంతో బాలయ్య మీ అమ్మకు చెప్పినట్లు నాకు కబుర్లు చెప్పకు అంటూ నవ్వులు పూయించారు.
ఆ తర్వాత ఆది పురుష్ కోస్టార్ కృతి సనన్ తో డేటింగ్ లైఫ్ గురించి అడిగారు బాలయ్య. దీనికి ప్రభాస్ సమాధానం ఇస్తూ.. ” ఈ పుకార్లలో ఎటువంటి వాస్తవం లేదు. మా మధ్య స్నేహం తప్ప అంతకుమించి ఏ రిలేషన్షిప్ లేదు. దీనిపై ఇప్పటికే కృతి సనన్ స్పష్టత ఇచ్చింది” అని చెప్పారు ప్రభాస్. ఇక నిజానికి ఈ మొదటి ఎపిసోడ్ శుక్రవారం విడుదలవుతుందని అందరూ భావించారు. దీనికి భిన్నంగా ఒకరోజు ముందే పై టెలికాస్ట్ చేసింది ఆహా మేనేజ్‌మెంట్.
Read More: Samantha – Naga Chaitanya: సామ్ – చై ఇద్దరికీ ఒకే ప్రాబ్లమ్… అసలేమైంది?
టాలీవుడ్ లో ఈ వారం థియేటర్లలో కంటే ఓటిటి...
ప్రముఖ హీరోయిన్ అవికా గోర్ గురించి ప్రత్యేకంగా...
నట సింహం నందమూరి బాలకృష్ణకు ఉన్న...
అన్ స్టాపబుల్ ఈ షో గురించి ప్రత్యేకంగా...
టాలీవుడ్ లో దసరా తర్వాత సినిమాల సీజన్...