Dhootha Web Series Release Date: దూతకు దారి దొరికింది

వరుస ఫ్లాప్‌లు ఎదుర్కొన్న నాగ చైతన్య హోప్స్ అన్ని ఇప్పుడు చందు మొండేటి మూవీపై ఉన్నాయి. దీంతో పాటు నాగ చైతన్యది మరో ప్రాజెక్ట్ కూడా ఉంది. అదే దూత అనే హర్రర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. అప్పుడెప్పుడో గతేడాది నాగ చైతన్య ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి, దూత వెబ్ సిరీస్ పై అధికారిక ప్రకటన చేశారు. అప్పటి నుంచే వేగంగా షూటింగ్ జరుపుకుంది. రెగ్యూలర్ కమర్షియల్ గా కాకుండా అవుట్ అండ్ అవుట్ హర్రర్ థ్రిల్లర్ జానర్ లో వెబ్ సిరీస్‌ను తెరకెక్కించారు.

అంతా బాగానే జరిగింది. కానీ, స్ట్రీమింగ్ డేట్‌కి వచ్చే సరికి అందరూ మౌనమే. నాగ చైతన్య అయితే దూత గురించి మర్చిపోయే ఉంటాడు. ఇక అమెజాన్ ప్రైమ్ వీడియో అయితే దూత మాటే ఎత్తడం లేదు. ఇక డైరెక్టర్ వెంకట్ ప్రభు… వీళ్ల కాంబినేషన్‌లో ఇప్పటికే వచ్చిన థాంక్యూ మూవీ ఎంత పెద్ద డిజాస్టార్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీంతో వెంకట్ ప్రభు కూడా ఎక్కడా దూత గురించి మాట్లాడలేదు. వీటిన్నిటి మధ్య అసలు దూత వెబ్ సిరీస్ ఉందా? అనే అనుమానాలు ఎక్కువయ్యాయి.

అయితే దూత ఇప్పుడు కొన్ని వార్తలు బాలీవుడ్‌లో సర్క్యూలేట్ అవుతున్నాయి. దూత ఆలస్యమవ్వడానికి రీజన్… విజువల్ పరంగా సరైన అవుట్ పుట్ రాలేదట. దీంతో కాస్త సమయం తీసుకున్నా బెటర్ అవుట్ పుట్ ఇవ్వాలని డైరెక్టర్ వెంకట్ ప్రభు అనుకున్నారట. అన్ని లాంగ్వేజేస్‌లో విడుదలయ్యే వెబ్ సిరీస్ కాబట్టి, వెంకట్ ప్రభు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. దీని వల్లే వెబ్ సిరీస్ ఆలస్యమైందని తెలుస్తుంది.

- Advertisement -

విజువల్స్ అనుకున్నట్టు రాలేకపోవడం వల్లే ప్రైమ్ వీడియో కూడా దూతపై ఇన్ని రోజులు సైలెంట్‌గా ఉందని టాక్. అన్ని కుదిరితే అక్టోబర్ చివరి వారంలో దూతను అమెజాన్ ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ కు తీసుకురావాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది.

Filmify gives an interesting update on celebrities in Tollywood & Bollywood and other industries. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other Movies news, etc.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు