Hunt : అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తున్న సుధీర్

నైట్రో స్టార్ సుధీర్ బాబు, మహేష్ సూరపనేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ”హంట్- గన్స్ డోంట్ లై”. ఇది ఒక ఇంట్రెస్టింగ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా. ఈ సినిమా లో శ్రీకాంత్, ప్రేమిస్తే ఫేమ్ భరత్ కీలక పాత్రల్లో నటించారు.

ఈ సినిమా లో ఓ పోలీస్ ఆఫీసర్ కమీషనర్ మర్డర్ కేసు ని ఇన్వెస్టిగేట్ చేసే క్రమంలో ఆక్సిడెంట్ అయి గతం మర్చిపోతాడు. అయినా సరే హీరో ఇ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తాడు. శ్రీకాంత్ ఆ కేసు ని ఛేదించేందుకు ప్రోత్సహిస్తూ ఉంటాడు. ఇక ఈ మిస్టరీ ని ఛేదించే సమయం లో హీరో ఎదుర్కొనే సన్నివేశాలు, వచ్చే సమస్యల నుంచి ఎలా తెప్పించుకుని కేసు ని సాల్వ్ చేస్తాడు అనేది స్టోరీ.

ఈ సినిమా జనవరి 26న ప్రేక్షలకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా అనుకున్నంత విజయాన్ని అందుకోలేదు. దీనితో ఈ సినిమా అప్పుడే ఓటిటి రిలీజ్ కు సిద్ధం అవుతుంది. ‘హంట్’ ఫిబ్రవరి 10వ తేదీన అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అవ్వనుంది.

- Advertisement -

ఇటీవల విడుదల అయిన టాలీవుడ్ సినిమాల్లో, ఇంత త్వరగా ఓటిటి రిలీజ్ అవుతున్న మొదటి సినిమా ఇది అని చెప్పచు. థియేటర్ లో రిలీజ్ ఆయె సినిమాలు కనీసం 4 నుంచి 8 వారల కాలం తరువాతే ఓటిటిలో రిలీజ్ చేయాలి అని రూల్ పెట్టుకున్నప్పటికీ, ఈ సినిమా కొన్ని కారణాల వాల్ల ఇంత త్వరగా రిలీజ్ చేయాల్సి వచ్చింది.

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు